Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో కూడా వంద కోట్లు అంటున్నాడే

ఇప్ప‌టికే టైర్ టూ హీరోల్లో నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోల వ‌ర‌కు చాలా మంది హీరోలు వంద కోట్ల‌ని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 April 2025 6:00 PM IST
Naga Chaitanya Targets 100cr Movie
X

టాలీవుడ్ క్రేజీ హీరోల సినిమాల బ‌డ్జెట్ ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. `బాహుబ‌లి`, RRR వంటి భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమాల త‌రువాత ప్ర‌తి హీరో అభిమాని క‌న్ను బ‌డ్జెట్‌పైనే ఉంటోంది. అంతే కాకుండా పెరిగిన తెలుగు మూవీ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది హీరోలు మ్యాగ్జిమ‌మ్ పాన్ ఇండియా మార్కెట్‌నే టార్గెట్‌గా పెట్టుకుని ప్రాజెక్ట్‌ల‌ని డిజైన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే టైర్ టూ హీరోల్లో నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోల వ‌ర‌కు చాలా మంది హీరోలు వంద కోట్ల‌ని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే జాబితాలోకి కొత్త‌గా అక్కినేని వారి హీరో అక్కినేని నాగ‌చైత‌న్య చేరిపోయాడు. వ‌రుస ఫ్లాపుల త‌రువాత చైతూ చేసిన మూవీ `తండేల్‌` ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల మార్కుని దాట‌డం తెలిసిందే.ఈ సినిమాతో వంద కోట్ల మార్కుని దాటిన హీరోల జాబితాలో చేరిన నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి సినిమాను కూడా ఇదే రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. `తండేల్‌` మూవీ త‌రువాత చైతూ ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

`విరూపాక్ష‌`తో భారీ విజ‌యాన్ని ద‌క్కించుకున్న సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ భారీ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క్రేజీ డైరెక్ట‌ర్‌, పుష్ప‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించిన సుకుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌పైకి రానున్న ఈ మూవీ కోసం ఏకంగా వంద కోట్లు ఖ‌ర్చు చేయాల‌నే ఆలోచ‌నలో సుక్కు, బి.వి.ఎస్‌.ఎన్ ఉన్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. అదే నిజ‌మైతే నాగ‌చైత‌న్య‌తో పాటు అక్కినేని హీరోల కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌పైకి రానున్న సినిమా ఇదే కానుంది.

మీనాక్షీ చౌద‌రి తొలిసారి చైతూకు జోడీగా న‌టిస్తున్న ఈమూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ స‌రిస‌రాల్లో జ‌రుగ‌తోంది. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈమూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ మూవీపై అంచ‌నాల్ని పెంచేశారు. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి మూవీని వ‌చ్చే ఏడాది అంటే 2026 స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.