చైతూ ఫాలో అయ్యాడని... అలా మా పెళ్లి అయింది!
శోభిత రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుడా నాగ చైతన్య ఫోటోలను సైతం ఆమె షేర్ చేస్తుంది.
By: Tupaki Desk | 31 May 2025 11:00 PM ISTఅక్కినేని జంట నాగ చైతన్య, శోభిత ప్రస్తుతం హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి సమయంలో నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఆ సమయంలో ఎక్కువగా ఇద్దరు సమయం గడపలేక పోయారు. అందుకే నాగ చైతన్య తదుపరి సినిమాకు సమయం ఉంది కనుక ప్రస్తుతం ఇద్దరూ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్ట్‌లో నాగ చైతన్య, శోభిత కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ లుక్‌లో చైతూ, అలాగే శోభితలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. శోభిత రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుడా నాగ చైతన్య ఫోటోలను సైతం ఆమె షేర్ చేస్తుంది.
ఇటీవల శోభిత తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. వందలాది మంది అడిగిన ప్రశ్నలకు శోభిత సమాధానం ఇచ్చింది. చాలా మంది నాగ చైతన్య కు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో పాటు, ఇద్దరు కలిసి నటిస్తారా అంటూ అడిగినట్లుగా తెలుస్తోంది. శోభిత చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ చైతన్యకు మీకు ఎలా లైన్ కలిసింది, మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు, అసలు ఎలా మీ ఇద్దరి మధ్య కనెక్షన్ కుదిరింది అంటూ చాలా మంది ఇలాంటి ప్రశ్నలు వేశారు. అందుకు శోభిత ఇచ్చిన సమాధానం మరింత అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒకసారి నాగ చైతన్య సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తున్న సమయంలో ఆయన నన్ను ఫాలో అవుతున్నట్లు తెలిసింది. ఆయన చాలా తక్కువ మందిని ఫాలో అవుతూ ఉన్నాడు. అందులో నేను ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే ఆయన్ను నేను ఫాలో కావడం మొదలు పెట్టాను. నేను ఫాలో కొట్టిన తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్ నడిచింది. కొన్నాళ్ల పాటు ఇద్దరం సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేస్తూ వచ్చాం. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగడంతో ఫోన్ నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకున్నాము అంటూ అలా మా పెళ్లి అయింది అంటూ తమ లవ్ స్టోరీని శోభిత మొదటి సారి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.
నాగ చైతన్య చాలా కాలం తర్వాత తండేల్ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు. సోలో హీరోగా తన మొదటి వంద కోట్ల సినిమాను దక్కించుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తదుపరి సినిమా ఉంటుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య త్వరలోనే మరో పెద్ద దర్శకుడితో కలిసి సినిమాను చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రకటన రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
