చక్కటి సంసారానికి చైతూ-శోభిత కండీషన్స్..!
నాగ చైతన్య, శోభితల జోడీ గురించి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 28 Jun 2025 3:57 PM ISTనాగ చైతన్య, శోభితల జోడీ గురించి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇద్దరూ చూడముచ్చటగా ఉంటారు, ఇద్దరి మధ్య అన్యోన్యత కనిపిస్తూ ఉంటుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అఖిల్ వివాహం సమయంలో వీరి జోడీ అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త జంట కంటే ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు అంటూ చాలా మంది ఆ సమయంలో కామెంట్ చేయడం మనం చూశాం. నాగ చైతన్యకి ఇది రెండో వివాహం అనే విషయం తెల్సిందే. దాంతో చాలా మంది వీరి వివాహం సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ, ఇండస్ట్రీ మాత్రమే కాకుండా అందరూ కుళ్లకునే విధంగా నాగచైతన్య, శోభితలు అన్యోన్యంగా ఉంటున్నారని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాగ చైతన్య, శోభితలు ఇద్దరు సినిమాల్లో ఉన్నారు. ఇద్దరికీ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ బిజీ షెడ్యూల్ కారణంగా ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోలేక పోతారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు గాను నాగ చైతన్య, శోభిత ముందుగానే కండీషన్స్ పెట్టుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ తన ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన చెప్పుకొచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ... ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటాం. అలాంటి సమయంలో ఇద్దరికి కలిసే సమయం తక్కువ ఉంటుంది. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడంకు సమయం తక్కువ ఉంటుంది. అందుకే క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం, ఇద్దరం కలిసి ఎక్కువ సమయం గడపడం కోసం మేము ఇద్దరం కలిసి, మాట్లాడుకుని కొన్ని కండీషన్స్ పెట్టుకున్నాము. అందులో భాగంగా మేము ఇద్దరం హైదరాబాద్‌లోనే ఉంటే తప్పకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ కలిసి చేయాలని కండీషన్ పెట్టుకున్నాం. అంతే కాకుండా మేము ఇద్దరం కచ్చితంగా వీకెండ్స్‌లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో ఇష్టమైనది ఆర్డర్ చేసుకుని తినడం, ఇష్టం అనిపించింది వండుకుని తినడం, ఇద్దరం కలిసి ట్రిప్స్‌కు వెళ్లడం, డ్రైవ్‌కి వెళ్లడం చేస్తామని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.
తన జీవితంలో సినిమాలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నట్లుగానే శోభితకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే బ్యాలన్స్ చేయాలని అనుకుంటాను. కెరీర్ పరంగా నాగ చైతన్య తండేల్‌తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసిన తండేల్ సినిమా తర్వాత నాగ చైతన్య కొత్త సినిమాను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. తండేల్ హిట్ కావడంతో నాగ చైతన్య తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా కార్తీక్ దండు ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
