Begin typing your search above and press return to search.

3 ఫొటోల్లో నాగచైతన్య లైఫ్..!

యువ హీరో నాగచైతన్య తన కెరీర్‌ను ఎప్పుడూ, క్లాసీగా నడిపించే వ్యక్తి. అక్కినేని వారసత్వం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   28 April 2025 10:16 AM IST
Naga Chaitanya Shares Intimate Moments on Instagram
X

యువ హీరో నాగచైతన్య తన కెరీర్‌ను ఎప్పుడూ, క్లాసీగా నడిపించే వ్యక్తి. అక్కినేని వారసత్వం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీస్‌లో తన ప్రత్యేకతను చూపిస్తూ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో పద్ధతిగా ఉండే చైతూ, ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ మాత్రమే పంచుతుంటాడు.


లేటెస్ట్ గా చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం, గ్యారేజ్‌లో కారుతో గడిపిన సమయం, మెట్లపై శాంతిగా ఉన్న పెంపుడు కుక్కను చూపిస్తూ ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ చైతూ ఎంత ఫ్యామిలీ ఒరియెంటెడ్, పర్సనల్ స్పేస్‌ను ఎంతగా విలువచేస్తాడో చెప్పడానికే. ముఖ్యంగా తనకు ఇష్టమైన కుక్కలు, కార్ల పట్ల ప్రేమను ఈ ఫోటోల్లో హైలైట్ చేశాడు.


అయితే ఫ్యాన్స్ గమనించిన స్పెషల్ విషయం ఏంటంటే.. చైతూ షేర్ చేసిన ఫోటోల మూడో ఫ్రేమ్‌లో శోభిత ధూళిపాళ కూడా ఉన్నారు. నాగచైతన్య, శోభితలు కొద్ది రోజుల క్రితమే కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ 3 ఫొటోల్లో చైతు తన లైఫ్ ను హైలెట్ చేశాడు. సింపుల్‌గా, తన ఇష్టాల్ని, ప్రేమను ఫోటోల్లో చూపించిన చైతూకి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.


ప్రస్తుతం చైతూ, శోభిత ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇక సినిమాల పరంగా కూడా చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడు. ఒకవైపు కెరీర్‌ను, మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ చైతూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు. ఇక ఫ్యూచర్‌లో వీరిద్దరి కలిసి ఒక సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పటికి సెట్టవుతుందో చూడాలి.