కొడుకు పుడితే అక్కినేని ఇంట మంచి రేసర్!
ప్రస్తుతం ఆ జోడీ ఎంతో సరదాగా గడుపుతుంది. శోభిత కూడా చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది.
By: Tupaki Desk | 27 July 2025 4:00 PM ISTయువ సామ్రాట్ నాగచైతన్య మంచి రేసర్. తల అజిత్ లా బైక్ ...రేసింగ్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి చైతన్యకు ఉన్న అలవాటు. ఎన్నో రేసింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాడు. దేశ విదేశాల్లో రేసింగ్ లో తన సత్తా ఏంటో చూపించాడు. అయితే నటుడైన తర్వాత రేసింగ్ కి మొల్లగా దూరమయ్యాడు. బైక్...కారు రేసింగ్ లాంటివి మంచిది కాదనని...తనపై నిర్మాతలు ఆధారపడి ఉండంతో వాళ్లంతా డిస్టబెన్స్ అవుతారని, అలాగే వ్యక్తిగత జీవితానికి రేసింగ్ శ్రేయస్కరం కాదని భావించి రేసింగ్ కి దూరమయ్యాడు.
కానీ మనసులో నుంచి మాత్రం రేసింగ్ డ్రీమ్ ఇప్పటికీ చెరిగిపోలేదు. ఆ కోరిక..ఆశలు ఇప్పటికీ సజీవం గానే ఉన్నాయి. అప్పుడప్పుడు సమయం చిక్కినప్పుడు రిస్క్ లేని రేసింగ్ చేస్తుంటాడు. అయితే రేసింగ్ లో తాను సాధించలేని సక్సస్ లు అన్నింటిని తన కొడుకు ద్వారా సాధ్యం చేస్తానంటున్నాడు చైతన్య. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపాడు. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య శోభినతను రెండవి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ జోడీ ఎంతో సరదాగా గడుపుతుంది. శోభిత కూడా చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. అక్కినేని ఇంట కోడలిగా అన్ని బాధ్యతలు నెరవర్తిస్తుంది. అయితే చైతన్య షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడలేకపోతున్నానన్నాడు. దీనికి సంబం ధించి ఇద్దరు కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నట్లు తెలిపాడు. `ఇంట్లో ఇంటే తప్పకుండా కలిసే భోజనం చేయాలి. సినిమాలకు, షికార్లకు వెళ్లినా ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చుకోవడం. ఈ మధ్యనే రేస్ ట్రాక్ పై శోభితకు డ్రైవింగ్ కూడా నేర్పించాడుట.
రేసింగ్ అన్నది తనకో థెరపీ లాంటిదన్నాడు. 50 ఏళ్లు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు..లేదా ఒకరు. కొడుకు పుడితే మాత్రం కచ్చితంగా తనని రేసింగ్ కాంపిటీషన్ లోకి దించుతానన్నాడు. కూతురు పుడితే మాత్రం తన ఇష్టప్రకారం పంపిస్తానన్నాడు. పిల్లలతో సమయం గడపాలని...చిన్నప్పుడు తాను ఎలా ఎంజ్ చేసా డో అలాగే తన పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం తాను చూడాలన్నాడు చైతన్య.
