'బెదురులంక' డైరెక్టర్‌తో అక్కినేని హీరో!
`తండేల్` తరువాత నాగచైతన్య ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 Dec 2025 4:00 AM IST`తండేల్` తరువాత నాగచైతన్య ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీకి `వృషకర్మ` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో నాగాచైతన్య పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
చైతూ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ఇది. అంతే కాకుండా `విరూపాక్ష` మూవీ తరువాత దర్శకుడు కార్తీక్ దండు చేస్తున్న సినిమా కావడంతొ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారట. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ పూర్తి చేసుకుని నాగచైతన్య సినిమాల్లోనే అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న సినిమాగా నిలిచింది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే నాగాచైతన్య మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `వృషకర్మ` తరువాత చైతూ `బెదురు లంక` ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలిసింది. 2023లో కార్తికేయతో క్లాక్స్ `బెదురులంక` మూవీ చేశాడు. యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమా తరువాత క్లాక్స్ మరో మూవీ చేయలేదు. త్వరలో చైతూనే ఓ సరికొత్త కథతో సినిమా చేయబోతున్నాడట.
ఇప్పటికే స్టోరీని లాక్ చేసిన క్లాక్స్ ఈ మూవీ షూటింగ్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలు పెట్టబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్‌ని ఎస్‌వీసీ ఎల్ ఎల్ పీ బ్యానర్‌పై ఏషియన్ సునీల్ నారంగ్‌తో కలిసి బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తారట. దీనికి సంబంధించిన అధికరిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇందులో చైతూకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అన్నది అప్పుడే బయటకు రానుంది.
