Begin typing your search above and press return to search.

చైత‌న్య NC24 మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

నాగ చైత‌న్య ప్ర‌స్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2025 9:56 AM
NC24 Update
X

గ‌త కొంతకాలంగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అక్కినేని హీరోల‌కు నాగ చైత‌న్య చేసిన తండేల్ సినిమా ఎంతో ఉప‌శ‌మనాన్ని ఇచ్చింది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన తండేల్ సినిమా మంచి టాక్ తో దుల్లగొట్టేసింది. తండేల్ స‌క్సెస్ తో నాగ చైత‌న్య సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు.

తండేల్ తో వంద కోట్ల సినిమాను త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో పాటూ త‌న‌లోని కొత్త న‌టుడిని బ‌య‌ట‌కు తీసి ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న నాగ చైత‌న్య ప్ర‌స్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్య‌క్రమాల‌తో మొద‌లైంది.

NC24 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేయ‌గా ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ స్పెష‌ల్ వీడియోలో చిత్ర యూనిట్ ను ప‌రిచ‌యం చేయ‌డంతో పాటూ వీడియో ఆఖ‌రిలో చైత‌న్య లుక్ ను కూడా రివీల్ చేశారు. చైతూ లుక్ ను చూస్తుంటే ఈ సినిమా కోసం అత‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి, చాలా కొత్త‌గా మేకోవ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 7 నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. చైత‌న్య త‌న కెరీర్లో చేస్తున్న మొట్ట‌మొద‌టి మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మ‌రి తండేల్ తో వ‌చ్చిన స‌క్సెస్ ను ఈ సినిమాతో చైత‌న్య కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.