సెట్ మరీ ఇంత డీటైలింగ్‌గానా కార్తీక్!
నిధి అన్వేషణతో పాటు వర్తమాన అంశాలతో ముడిపడిన కథగా దీన్ని దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు.
By: Tupaki Desk | 17 May 2025 12:49 PM ISTఅక్కినేని నాగచైతన్య స్పీడు పెంచేశాడు. చందూ మొండేటి తెరకెక్కించిన `తండేల్` మూవీతో బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చైతూ ఇక వెనుతిరిగి చూసుకోకూడదని, స్పీడు పెంచాలని నిర్ణయాంచుకున్నాడు. ఇందులో బాగంగానే `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ట్రెజర్ హంట్ మిస్టిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. చైతూ నటిస్తున్న 24వ ప్రాజెక్ట్ ఇది.
`NC24` అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, ఉకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీవీఎస్ ఎన్ ప్రసాద్,సుకుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా హర్యానా సోయగం మీనాక్షీ చౌదరి నటిస్తోంది. చైతూ ఇందులో ట్రెజర్ హంటర్‌గా సహసోపేతయైన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా గుహ సెట్‌ని ఏర్పాటు చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ పనాగేంద్ర తుంగల నేతృత్వంలో ఈ సెట్‌ని సర్వాంగ సుందరంగా రూపొందించారు. ఈ గుహ సెట్‌లో గత 18 రోజులుగా షూటింగ్ జరుగతోంది. `విరూపాక్ష`లోని ప్రతి అంశాన్ని చాలా డీటైలింగ్‌గా సిద్ధం చేసి సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు తాజా మూవీ కోసం వేసిన గుహ సెట్ విషయంలోనూ ప్రతి చిన్న డీటైలింగ్‌ని కూడా వదలకుండా ఏర్పాటు చేయించినట్టుగా ఇన్ సైడ్ టాక్.
ఈ సెట్ కోసం టీమ్ అంతా రెండు నెలలు వర్క్ చేసిందట. సెట్ రియల్‌గా కనిపించాలని ఇందు కోసం ప్రతి చిన్న బిట్‌ని కూడా వదలకుండా చాలా అథెంటిక్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సెట్‌లోనే షూటింగ్ జరుగతోంది. ఈ గుహ నేపథ్యంలో వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ ధీమాగా చెబుతున్నాడు. నిధి అన్వేషణతో పాటు వర్తమాన అంశాలతో ముడిపడిన కథగా దీన్ని దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమాతో చైతూ మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారంటీగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.
