Begin typing your search above and press return to search.

NC24 కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న చైతూ

గ‌త కొన్ని సినిమాలుగా ఫ్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్న అక్కినేని నాగ‌చైత‌న్య‌కు అత‌ని చివ‌రి సినిమా తండేల్ మంచి బూస్ట‌ప్ ను ఇచ్చింది.

By:  Tupaki Desk   |   31 May 2025 11:48 AM IST
NC24 కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న చైతూ
X

గ‌త కొన్ని సినిమాలుగా ఫ్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్న అక్కినేని నాగ‌చైత‌న్య‌కు అత‌ని చివ‌రి సినిమా తండేల్ మంచి బూస్ట‌ప్ ను ఇచ్చింది. తండేల్ సినిమాతో చైత‌న్య కెరీర్ బెస్ట్ బాక్సాఫీస్ నెంబ‌ర్ల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా త‌న ఫ్లాపుల ప‌రంపర‌కు ఫుల్‌స్టాప్ కూడా పెట్టాడు. అయితే తండేల్ సినిమా స‌క్సెస్ చైత‌న్య‌కు ఏం ఊరికే రాలేదు. ఆ సినిమా కోసం తానెంతో క‌ష్ట‌ప‌డ్డాడు.

తండేల్ సినిమాలో త‌న మేకోవ‌ర్ కోసం ఎంతో టైమ్ కేటాయించి, చాలా ప్ర‌య‌త్నాలు చేసి రాజు పాత్ర‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. చైత‌న్య ప‌డ్డ క‌ష్టానికి తండేల్ సినిమాతో మంచి ఫలితం ద‌క్క‌డంతో పాటూ ఆ సినిమా స‌క్సెస్ అత‌ని మార్కెట్ ను కూడా బాగా పెంచేసింది. ఇక అస‌లు విష‌యానికొస్తే తండేల్ త‌ర్వాత నాగ‌చైత‌న్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

చైతూ కెరీర్ లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం కూడా చైత‌న్య మ‌రోసారి అద్భుత‌మైన మేకోవ‌ర్ చేయ‌నున్నట్టు తెలుస్తోంది. NC24 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ లో నాగ‌చైత‌న్య అడ్వెంచ‌ర‌ర్ గా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సాహ‌సాలు చేస్తూ, స‌వాళ్లు, ప్ర‌మాదాల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఉండే క‌ఠిన‌మైన వ్య‌క్తిగా చైతూ ఈ మూవీలో క‌నిపిస్తాడ‌ట‌.

ఆ పాత్ర కోసం దానికి తగ్గ‌ట్టు ఇప్పుడు చైతూ త‌న‌ను తాను మర‌ల్చుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఎలాగూ చైత‌న్య ఫిట్‌నెస్ ఫ్రీక్ కాబ‌ట్టి, త‌న బాడీని మేకోవ‌ర్ చేసుకోవ‌డం త‌న‌కేం పెద్ద ఛాలెంజ్ కాదు. అయిన‌ప్ప‌టికీ త‌న పాత్ర‌కు మంచి లుక్ ను ఇచ్చే అద్భుత‌మైన మేకోవ‌ర్ కోసం చైత‌న్య త‌న ఫిట్‌నెస్ కోచ్ నుంచి క‌ఠిన‌మైన ట్రైనింగ్ తీసుకుంటూ కఠిన‌మైన డైట్ ను ఫాలో అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ రీసెంట్ గానే హైద‌రాబాద్ లో మొద‌లైంది. మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.