Begin typing your search above and press return to search.

NC24: మరో సర్ ప్రైజ్ కు సిద్దమవుతున్న నాగచైతన్య

ఈ సినిమాలో చైతూ స్టైల్, లుక్, క్యారెక్టర్ అన్నీ ఔట్ ఆఫ్ ది బాక్స్ గా ఉండనున్నాయంటూ ప్రచారం మొదలైంది.

By:  Tupaki Desk   |   17 April 2025 6:23 PM IST
NC24: మరో సర్ ప్రైజ్ కు సిద్దమవుతున్న నాగచైతన్య
X

ఈమధ్య కాలంలో రెగ్యులర్ కమర్షియల్ కథలను పక్కన పెట్టి డిఫరెంట్ కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో నాగచైతన్య ఒకరు. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచిన తండేల్. ఇక దీని తర్వాత వచ్చే సినిమా కంటెంట్‌ ఎలా ఉండనుంది? అనే విషయాలపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు అందుకు సమాధానంగా కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది.

ఈ సినిమాలో చైతూ స్టైల్, లుక్, క్యారెక్టర్ అన్నీ ఔట్ ఆఫ్ ది బాక్స్ గా ఉండనున్నాయంటూ ప్రచారం మొదలైంది. ఈ కొత్త సినిమా #NC24 అనే వర్కింగ్ టైటిల్ తో సిద్ధమవుతోంది. ఇప్పటికే విరూపాక్ష లాంటి మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ హారర్ అండ్ మైథికల్ థ్రిల్ మిక్స్‌తో వినూత్న ప్రయోగంగా చూపించనున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌కి సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, ప్రీ-ప్రొడక్షన్ దశలో నుంచే హై వాల్యూస్ చూపించడం చూస్తే, కంటెంట్ పరంగా చాలా కొత్తగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అలాగే మేకర్స్ సరికొత్త ఇన్నోవేషన్ కోసం పరితపిస్తున్నారని అర్థమవుతుంది. ఇక అసలు హైలైట్ విషయం.. చైతూ లుక్. తండేల్ సినిమాలో ఫిషర్‌మన్ లా కండలు తిరిగిన రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.

లేటెస్ట్ ఫోటోలను చూస్తే చైతూ దాదాపు ఒక ఇంటర్నేషనల్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ట్రెండీ గెటప్‌తో కొత్తగా మెరుస్తున్నారు. అయితే ఈ లుక్ కేవలం శరీర రూపమే కాదు, అతని క్యారెక్టర్ డిజైన్ కూడా ఊహించని మలుపులతో నిండిపోయిందట. ఇతర చిత్రాలతో పోలిస్తే, ఇందులో చైతూ పాత్ర డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుందని టీమ్ చెబుతోంది. ఎమోషనల్ గా ఓ ఎడ్జ్ ఉండేలా, స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే ప్రతీ సీన్ లోనూ ఆయన క్యారెక్టర్ ఓ థ్రిల్ కలిగించేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

కథలో కొన్ని రహస్యాలు, అనూహ్య మలుపులతో ఈ సినిమా పీక్ థ్రిల్లర్‌గా తయారవుతోందట. చైతూ కెరీర్‌లో ఈ చిత్రం అతడి నటనకు మరో డెఫినిషన్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైన లుక్ పోస్టర్‌తోనే చైతన్యపై టాలీవుడ్ మొత్తం దృష్టి పడింది. మొత్తానికి తండేల్ రఫ్ లుక్ తర్వాత, #NC24లో చైతన్య స్టైలిష్ షేడ్స్ చూపించనున్నాడనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు మారుమూల అడవుల్లో జరగబోయే కీలక షెడ్యూల్‌లతో షూటింగ్ వేగంగా జరగనుంది. మరి సినిమా ఫస్ట్ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.