నాగ చైతన్య అండ్ కో గుజరాత్ లో!
యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jun 2025 4:26 PM ISTయువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి థ్రిల్లర్ సినిమా చేయడం చైతన్యకు ఇదే తొలిసారి. దీంతో నాగ చైతన్య రోల్ ఎలా ఉంటుంది? ఎలాంటి పెర్పార్మెన్స్ ఇస్తాడు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని భారీ సెట్లు వేసి చిత్రీకరించారు. ఇటీవలే ఓ గుహ సెట్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.
ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని కార్తీక్ ధీమా వ్యక్తం చేసాడు. విరూపాక్ష తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విరూపాక్ష నుంచి మించిన థ్రిల్లర్ అంశాలు సినిమాలో ఉంటాయని ప్రేక్షుకులు ఆశిస్తున్నారు. తాజాగా ఈనెల చివరి వారంలో గుజరాత్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. నాగచైతన్య సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ కథకు గుజరాత్ లొకేషన్ కు ప్రత్యేకమైన సంబంధం ఉందట. స్టోరీ రాసే ముందు అక్కడ కొన్ని లోకేషన్లను పరిశీలించి స్క్రిప్ట్ లో జోడించారట. ఈ నేపథ్యంలోనే అదే ప్రాంతమైన ఒరిజినల్ లొకేషన్ లోనే ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఇంత వరకూ ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లలేదు. చిత్రీకరణ అంతా హైదరాబాద్ లో నిర్మించిన సెట్లు...స్టూడియోల్లోనే నిర్వహించారు.
తొలిసారి కీలక షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్తున్నారు. అక్కడ లొకేషన్లు ఏంటి? అన్నది వెళ్లేవరకూ క్లారిటీ రాదు. ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ హెయిర్ స్టైల్లో ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే లీక్ అయిన ప్రయివేట్ ఫోటోలను బట్టి చైతన్య లుక్ ఎలా ఉంటుందన్నది క్లారిటీ వస్తుంది. ఆ లుక్ లో చైతన్య మరింత స్మార్ట్ గా ఉన్నాడు.
