హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చైతూ ల్యాండ్‌మార్క్ మూవీ
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 12:26 PM ISTగత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. తండేల్ సక్సెస్ ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్లో 24వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విరూపాక్ష లాగానే ఈ సినిమా కూడా మైథలాజికల్ థ్రిల్లర్ గానే రూపొందుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ వృష కర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతోంది.
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆల్రెడీ డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చి, ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య ఓ ప్రాజెక్టు చేయాలని డిస్కషన్స్ జరుగుతుండగా, శివ నిర్వాణతో తన 25వ సినిమాను చేస్తే బావుంటుందని చైతూ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా, ఆల్రెడీ చైతన్యకు, శివ నిర్వాణకు ఈ సినిమా కోసం అడ్వాన్సులు కూడా అందాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కోసం శివ నిర్వాణ డైలాగ్ వెర్షన్ ను రెడీ చేస్తున్నాడట. కాగా గతంలో శివ నిర్వాణ నాగ చైతన్యతో కలిసి మజిలీ అనే సినిమా చేయగా, ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
మజిలీ తర్వాత శివ నిర్వాణ రెండు సినిమాలు చేశాడు. నాని తో టక్ జగదీష్ చేయగా ఆ సినిమా మంచి అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తే ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తనకు మజిలీ లాంటి హిట్ ఇచ్చిన చైతన్యతో సినిమా చేసి ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శివ. ఈ మూవీని కూడా శివ ఫీల్‌గుడ్ ఎమోషన్స్, యాక్షన్ ను కలిపి తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆఖర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.
