నాగచైతన్య క్రష్ గురించి ఆవిడకి తెలుసా?
యువ సామ్రాట్ నాగచైతన్య పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. `తండేల్` తో 100 కోట్ల క్లబ్లో కి అడుగు పెట్టాడు.
By: Tupaki Desk | 7 July 2025 8:00 AM ISTయువ సామ్రాట్ నాగచైతన్య పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'తండేల్' తో 100 కోట్ల క్లబ్లో కి అడుగు పెట్టాడు. దీంతో తదుపరి సినిమా రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తోన్న మిస్టికల్ థ్రిల్లర్ పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకె క్కుతోన్న చిత్ర మిది. ఈసినిమా కోసం లుక్ పరంగాను చైతన్య కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. స్టైలిష్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఆ సంగతి పక్కన బెడితే చైతన్య ఎంతో ఓపెన్ పర్సన్. వృత్తి గతానికి సంబంధించిన విషయాలపై ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఏ నటితో కలిసి నటించాలని కోరుకుంటున్నారు? అంటే ఠక్కున బాలీవుడ్ నటి అలియాభట్ పేరు చెప్పాడు. అలియాభట్ నటన అంటే ఇష్టమన్నాడు. ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనన్నాడు. ఈ సందర్బంగా మరోసారి తన క్రష్ గురించి కూడా రివీల్ చేసాడు.
మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ పేరు చెప్పాడు. సుస్మితను కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తనకీ చెప్పినట్లు తెలిపాడు. సాధారణంగా ఇలాంటి క్రష్ విషయాలు మీడియా ముందు ఓపెన్ అవుతారు. కానీ ఆ విషయాలు అసలైన వ్యక్తులకు మాత్రం తెలియవు. అందులోనూ చైతన్యలా అందరూ ఓపెన్ గానే క్రష్ ఫిలింగ్ ని నేరుగా వాళ్ల వద్ద వ్యక్తం చేయలేరు. చైతన్య మాత్రం సుస్మితా సేన్ వద్దనే ఓపెన్ అవ్వడం విశేషం.
ప్రస్తుతం సుస్మితా సేన్ సినిమాల నుంచి కూడా రిటైర్ అయిపోయింది. 2015 నుంచి సినిమాలు చేయ లేదు. చివరిగా నిర్బాక్ అనే గుజరాతీ చిత్రంలో నటించింది. అయితే రెండేళ్ల క్రితం తాల్ అనే సిరీస్ లో నటించింది. ఇది పెద్దహిట్ అయింది. సుస్మిత ఈజ్ బ్యాక్ అనిపించింది . కానీ ఆతర్వాత వెబ్ సిరీస్ ల్లో కూడా కొనసాగలేదు. సుస్మితా సేన్ వయసు 50 కి చేరువలో ఉన్న సంగతి తెలిసిందే.
