Begin typing your search above and press return to search.

చైతూ కొత్త చిత్రం.. ఆ రూట్లో అడ్వెంచర్!

ఇప్పుడు నాగ చైత‌న్య విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ దండుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2025 8:00 PM IST
చైతూ కొత్త చిత్రం.. ఆ రూట్లో అడ్వెంచర్!
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్ గా తండేల్ మూవీతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు యువసామ్రాట్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా తీసిన మూవీతో అందరినీ మెప్పించారు.

ఇప్పుడు నాగ చైత‌న్య విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ దండుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఆ మూవీలో లాపాటా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌ గా నటిస్తున్నారని సమాచారం.

అయితే కొన్ని నెలల క్రితం చైతూ- కార్తీక్ మూవీ షూటింగ్ ప్రారంభమవ్వగా.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైందని సమాచారం. ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారని వినికిడి.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై నాగచైతన్య చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. తన కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పారు చైతూ. ఆ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. మైథాలిజికల్ థ్రిల్లర్ గా రానున్న ఆ మూవీ.. భారీ వీఎఫ్ ఎక్స్ వర్క్ తో కూడిన హంట్ అడ్వెంచర్ జోన్‌ కిందకు వస్తుందని వెల్లడించారు.

దీంతో ఆయన కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. చైతన్యకు మరో హిట్ పక్కా అని అనిపిస్తుందని చెబుతున్నారు. విరూపాక్షతో మ్యాజిక్ చేసిన కార్తీక్ దండు ఈ సారి ఎలా అలరిస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్ గా మూవీ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు.

ఇక సినిమాకు వృష కర్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ.. టైటిల్ ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని వినికిడి. మరి నాగచైతన్య, కార్తీక్ దండు మూవీ ఎప్పుడు వస్తుందో.. ఎలా ఉంటుందో.. ఏ టైటిల్ ప్రకటిస్తారో వేచి చూడాలి.