సెట్స్ లో ఉండగానే 25పై చైతన్య కసరత్తులు!
ఇది చైతన్య 24వ చిత్రం. అయితే ఈ సినిమా సెట్స్లో ఉండగానే 25వ చిత్రంపై కూడా చైతన్య దృష్టి పెట్టాడు.
By: Tupaki Desk | 2 April 2025 11:46 AM ISTయువ సామ్రాట్ నాగచైతన్య ఫుల్ జోష్ లోఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'తండేల్' తో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అక్కినేని ఫ్యామిలీలోనే తొలిసారి సెంచరీ నమోదు చేసిన స్టార్ గా ఆవిర్భవించాడు. దీంతో నాగార్జున కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడదే రెట్టించిన ఉత్సాహంతో నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లు పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చైతన్య హీరోగా 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండు ఓ మిస్టికల్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.
'విరూపాక్ష' కూడా 100 కోట్లు తెచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపైనా భారీ అంచనాలున్నాయి. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఈనెల రెండో వారంలో హైదరాబాద్ లో మొదలవుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది చైతన్య 24వ చిత్రం. అయితే ఈ సినిమా సెట్స్లో ఉండగానే 25వ చిత్రంపై కూడా చైతన్య దృష్టి పెట్టాడు.
కిషోర్ అనే కొత్త కుర్రాడి కథను ఒకే చేసినట్లు వార్త లొస్తున్నాయి. ఇందులో చైతన్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని మునుపెన్నడు పోషించని ఛాలెంజింగ్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. అయితే ఈ సినిమాకు ఇంకా నిర్మాత ఫైనల్ కాలేదట. పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.
'తండేల్ 'తో చైతన్య 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ గా అవతరిం చడంతో? సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా రాజీ లేని నిర్మాణం ఉండాలని..అందుకోసమే పర్పెక్ట్ నిర్మాణ సంస్థను పిల్టర్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించ నున్నారని తెలుస్తోంది.
