Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్త్‌డే మై లేడీ : చైతూ

టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సెలబ్రెటీ కపుల్‌ నాగ చైతన్య, శోభిత దూళిపాళ ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2025 4:31 PM IST
హ్యాపీ బర్త్‌డే మై లేడీ : చైతూ
X

టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సెలబ్రెటీ కపుల్‌ నాగ చైతన్య, శోభిత దూళిపాళ ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో శోభిత దూళిపాళ బర్త్‌డే వచ్చింది. బర్త్‌డే వేడుకను నాగ చైతన్య విదేశాల్లోనే గ్రాండ్‌గా చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత మొదటి సారి బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. పెళ్లి తర్వాత శోభిత మొదటి బర్త్‌డే కావడంతో నాగ చైతన్య చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఉన్న ప్రాంతంలో సన్నిహితులకు పెద్ద పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు, ఖరీదైన బహుమానం సైతం శోభితకు ఇచ్చాడు అంటూ వారి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

నాగ చైతన్య సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు అనే విషయం తెల్సిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య చాలా అరుదుగా మాత్రమే పోస్ట్‌లు పెడుతూ ఉంటాడు. తాజాగా ఆయన నుంచి శోభిత బర్త్‌డే స్పెషల్‌ పోస్ట్‌ వచ్చింది. నాగ చైతన్య తన భార్య శోభితతో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై లేడీ అని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో నాగ చైతన్య హ్యాండ్సమ్‌ లుక్‌తో మతి పోగొట్టాడు. నాగ చైతన్య సెల్ఫీ తీస్తూ ఉండగా, శోభిత ఆయన భుజం పై తల పెట్టుకుని ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీని మోస్ట్‌ రొమాంటిక్ సెల్ఫీ అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య పోస్ట్‌కు అక్కినేని అభిమానులతో పాటు చాలా మంది నెటిజన్స్‌ శోభితకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్‌ చేస్తున్నారు.

శోభిత నటిగా పలు సినిమాలు, సిరీస్‌లు చేసింది. సమంతతో విడిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నాగ చైతన్య సోలోగానే జీవితాన్ని సాగించాడు. ఆ సమయంలోనే శోభితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సోషల్‌ మీడియా వారధిగా నిలిచింది. నాగ చైతన్య తనను ఫాలో అవుతున్నాడు అని తెలిసి ఆశ్చర్యపోయిన శోభిత తిరిగి ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. ఇద్దరి మధ్య చాటింగ్‌ మొదలైంది, ఆ తర్వాత మీటింగ్స్ జరిగాయి. ఫోన్‌ నెంబర్స్‌ ఇచ్చి పుచ్చుకోవడంతో మాటలు కలిశాయి. అలా మా పెళ్లి జరిగింది అంటూ శోభిత ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన సందర్భంగా తమ పెళ్లి సీక్రెట్‌ను రివీల్‌ చేసింది.

నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఏప్రిల్‌ నెలలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాను ప్రకటించి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పట్టాలు ఎక్కలేదు. వచ్చే నెలలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే విధంగా దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే నాగ చైతన్య, శోభితలు కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. శోభిత తెలుగు సినిమాల కంటే ఎక్కువగా హిందీ సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తోంది. ఆ మధ్య ఒక తమిళ్ సినిమాలోనూ నటించడం ద్వారా అక్కడ కూడా గుర్తింపు దక్కించుకుంది.