కుబేర మూవీ.. నాగ్ అశ్విన్ ఘాటైన రివ్యూ చూశారా?
ఇప్పుడు కుబేర మూవీపై మరో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ పెట్టారు. సినిమాను చూసిన ఆయన.. తనదైన రీతిలో రివ్యూ ఇచ్చారు.
By: Tupaki Desk | 20 Jun 2025 1:55 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన కుబేర వరల్డ్ వైడ్ గా నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లు భారీ బడ్జెట్ తో నిర్మించాయి.
సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల నిర్మించిన కుబేర మూవీలో జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, సాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ ఈవెంట్స్ తో వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
హైదరాబాద్, ముంబై, చెన్నైలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్ తో కచ్చితంగా మూవీ చూడాలనేంతగా బజ్ సృష్టించారు. శేఖర్ కమ్ముల తన రోటీన్ స్టైల్ కు భిన్నంగా పొలిటికల్, క్రైమ్ యాంగిల్ టచ్ చేయడంతో కుబేర కోసం అంతా వెయిట్ చేశారు. ఇప్పుడు సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పిస్తోంది.
సినిమా చాలా బాగుందని మూవీ లవర్స్ రివ్యూస్ ఇస్తున్నారు. ఓ బిచ్చగాడు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రమాదంలో పడేసేలా చేశాడనేది కీ పాయింట్ అని, అది సూపర్ అని చెబుతున్నారు. ఓవరాల్ గా వాస్తవికతకు దగ్గరగా శేఖర్ కమ్ముల మరోసారి సినిమా తీశారని అంటున్నారు. థ్రిల్లింగ్ పాయింట్ తో తెరకెక్కించిన విధానాన్ని కొనియాడాతున్నారు.
ఇప్పుడు కుబేర మూవీపై మరో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ పెట్టారు. సినిమాను చూసిన ఆయన.. తనదైన రీతిలో రివ్యూ ఇచ్చారు. తెరపై 25 ఏళ్ల శేఖర్ కమ్ముల కెరీర్ అంటూ వచ్చిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఆ తర్వాత మాస్టర్ ఫ*కింగ్ పీస్.. ఆలోచించకండి.. సినిమాకు వెళ్లండి అంటూ రాసుకొచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ప్రస్తుతం ఆయన ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్ అశ్విన్ కు సినిమా బాగా నచ్చినట్లు ఉందని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాను చూసిన వారు.. అవును నిజమే.. కుబేర మాస్టర్ పీస్ అంటూ కొనియాడుతున్నారు. మూవీ చూడని వారు.. కచ్చితంగా చూసేయాలని అని చెబుతున్నారు. మరి ఓవరాల్ గా కుబేర చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
