Begin typing your search above and press return to search.

కల్కి సీక్వెల్.. సాయిపల్లవి కాకపోతే మరెవరు?

సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పోషించిన సుమతి (సమ్-80) కోల్ స్టోరీలో కీలకంగా నిలిచింది.

By:  M Prashanth   |   16 Jun 2026 10:52 AM IST
కల్కి సీక్వెల్.. సాయిపల్లవి కాకపోతే మరెవరు?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పోషించిన సుమతి (సమ్-80) కోల్ స్టోరీలో కీలకంగా నిలిచింది. మూవీ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరగడంతో, ఇప్పుడు రూపొందుతున్న కల్కి-2లో సుమతి రోల్ ను ఎవరు పోషిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఆ రోల్ కు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని కాల్షీట్ల సమస్యలు, ఇతర కారణాల వల్ల దీపికా పదుకొనే సీక్వెల్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ కోసం మూవీ టీమ్ సెర్చ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేర్లు వినిపించాయి.

ఆ తర్వాత నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. సుమతి పాత్రలో కనిపించేది ఆమెనేనని, ఇప్పటికే సెలెక్ట్ చేశారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ప్రభాస్‌ తో కలిసి సాయిపల్లవి షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉండగా, ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా షెడ్యూల్ వాయిదా పడిందంటూ మరో రూమర్ కూడా వైరల్ అయింది.

కంప్లీట్ ఎమోషన్స్ తో నిండిన సుమతి రోల్ కు సాయిపల్లవి న్యాయం చేయగలదని, సరైన సెలక్షన్ అవుతుందని అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఆ ప్రచారాలన్నింటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చెక్ పెట్టారు. కల్కి-2కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమాలో సుమతి పాత్ర చాలా మెయిన్ అని, ఆ పాత్రను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

అలాగే, సుమతి పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. సరైన సమయంలో ఆ పాత్రకు సంబంధించిన అధికారిక వివరాలను అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే కల్కి-2కి సంబంధించిన రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు.

సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతుందని చెప్పారు. ఏదేమైనా సుమతి పాత్ర విషయంలో నెలకొన్న సస్పెన్స్‌ కు దర్శకుడు కొంతవరకు తెరదించినా.. ఆ రోల్ లో చివరికి ఎవరు కనిపిస్తారన్న ప్రశ్నకు మాత్రం ఇంకా ఆన్సర్ రాలేదు. సాయిపల్లవి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ, అది నిజం కాదని నాగ్ అశ్విన్ స్పష్టం చేయడంతో అభిమానులు ఇప్పుడు అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌ లో వస్తున్న కల్కి సీక్వెల్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టోరీలో కీ పాయింట్ గా నిలిచిన సుమతి పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు కల్కి-2కి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆ రూమర్లకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. మరి సాయి పల్లవి కాకుండా ఎవరు యాక్ట్ చేయనున్నారో వేచి చూడాలి.