మహేష్ కోసం రెడీ అవుతోన్న నాగీ?
నాగ్ అశ్విన్ ముందున్న బిగ్ ఛాలెంజ్ `కల్కి 2` పట్టాలెక్కించి పూర్తి చేయడం. ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో నే బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 20 May 2025 4:00 AM ISTనాగ్ అశ్విన్ ముందున్న బిగ్ ఛాలెంజ్ `కల్కి 2` పట్టాలెక్కించి పూర్తి చేయడం. ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో నే బిజీగా ఉన్నాడు. `కల్కి 2898`కి కొనసాగింపుగా ఎలాంటి ముగింపు ఇస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది పట్టాలెక్కించాలన్నది ప్లాన్. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెండేళ్ల కు పైగా సమయం పడుతుంది.
అటుపై నాగీ టార్గెట్ చేసిన హీరో ఎవరు? అంటే సూపర్ స్టార్ మహేష్ గా వినిపిస్తుంది. మహేష్ తో నాగీ ఏకంగా హాలీవుడ్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహితుల సమాచారం. ఎస్ ఎస్ ఎంబీ 29 తో మహేష్ ఎలాగూ ఆ రేంజ్ ని టచ్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ సహా తన ప్యూచర్ ని ప్లాన్ చేసుకుని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మహేష్ తో భారీ టెక్నికల్ స్టాండర్డ్ ఉన్న సినిమా చేయాలనే ఆలోచ నతో ఉన్నాడుట.
స్టోరీ లైన్ కూడా ఒకటుందిట. అయితే అది ఇంకా మహేష్ వద్దకు చేరలేదని అంటున్నారు. తన విజన్ లో మాత్రమే మహేష్ ని ఇలా చూపిస్తే బాగుంటుందని భావిస్తున్నాడుట. ఇదంతా రెండేళ్ల తర్వాత మొదలయ్యే ప్రక్రియ. అప్పటి వరకూ దీని గురించి సీరియస్ గా ఆలోచించే పరిస్థితి ఉండదు.
`కల్కి 2898` తోనే నాగీ సాంకేతికంగా ఎంతటి ప్రతిభావంతుడన్నది ప్రూవ్ అయింది. తొలి సినిమా అయినా ఎంతో గొప్పగా తీసాడు. తన కథలోనూ...విజన్ లోనూ ఓ క్లారిటీ ఉంది. హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసి గొప్ప టెక్నిషియన్ అనిపించుకున్నాడు. నాగీ పనితనాన్ని ఇండస్ట్రీ సహా రాజమౌళి ఎంత గొప్పగా ప్రశంశిం చాడో తెలిసిందే.
