ప్రభాస్ 'కల్కి 2'.. నాగ్ అశ్విన్ ట్విస్ట్ వింటే షాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 12:45 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించారు.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిందనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. అయితే నాగ్ అశ్విన్.. ఆడియన్స్ ను మేకింగ్ అండ్ టేకింగ్ తో అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు.
సినిమాలో అశ్వత్థామగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ నటించి ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు గెస్ట్ రోల్స్ లో సందడి చేశారు. సినిమాలో క్యామియో రోల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే అంతా ఇప్పుడు సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ కల్కి సీక్వెల్ రిలీజ్ పై ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ కు రీసెంట్ గా విడుదల తేదీపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. కల్కిని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశానని, దాని సీక్వెల్ ను 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు రిలీజ్ చేస్తానని అన్నారు.
అందుకే అందరూ వెయిట్ చేయండని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంప్లీట్ సోలార్ సిస్టమ్ ఎలైన్ అయినప్పుడు చేస్తారా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఫన్నీ రిప్లై సూపర్ గా ఉందని అంటున్నారు. ఏదేమైనా సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయని, వెయిట్ చేస్తున్నారని అంటున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. 2026 చివర్లో సెట్స్ పై వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. సీక్వెల్ లో ప్రభాస్ ఎక్కువ సేపు స్క్రీన్ పై కనిపిస్తారని అన్నారు. ఆయన రోల్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని వెల్లడించారు. మరి కల్కి-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
