దాని వల్ల వారం రోజులు డిప్రెషన్ లో ఉన్నా
ఈ ఇంటరాక్షన్‌లో నాగ్ అశ్విన్ తన వ్యక్తిగత విషయాన్ని ఒకదాన్ని పంచుకుని దాని గురించి మాట్లాడాడు.
By: Tupaki Desk | 15 April 2025 6:37 PM ISTఇండియన్ సినిమాలో సై-ఫై స్థాయిని అమాంతం పెంచిన డైరక్టర్ నాగ్ అశ్విన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆయన చేసిన కల్కి 2898ఏడీ సినిమా నాగ్ అశ్విన్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం కల్కి2 స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ రీసెంట్ గా కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయి, సినిమాపై తన ఆలోచనలను షేర్ చేసుకున్నాడు.
ఈ ఇంటరాక్షన్‌లో నాగ్ అశ్విన్ తన వ్యక్తిగత విషయాన్ని ఒకదాన్ని పంచుకుని దాని గురించి మాట్లాడాడు. మనకు వచ్చిన ఆలోచనలతో వేరే వాళ్లు సినిమాలు చేస్తారనే కంప్లైంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుందని, అది అందరికీ కామనే అని, తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని తెలిపాడు నాగి. తన ఆలోచనలతో వేరే సినిమా వస్తుందని తెలిసి వారం రోజుల పాటూ నిరాశకు లోనైన విషయాన్ని కూడా నాగి వెల్లడించాడు.
అయితే నాగ్ అశ్విన్ చెప్తుంది ఏదో సినిమా గురించి కాదు. ప్రముఖ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఇన్సెప్షన్ సినిమా గురించి. 2008లో తనక్కూడా ఇన్సెప్షన్ లాంటి ఆలోచనే వచ్చిందని, నోలన్ మూవీ డ్రీమ్స్ గురించి అయితే, తనది ఆలోచనల గురించని తెలిపాడు. కానీ ఇన్సెప్షన్ ట్రైలర్ చూసిన తర్వాత తన ఆలోచనను విరమించుకున్నట్టు నాగి చెప్పాడు.
ఆ విషయం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పిన నాగి, దాని వల్ల వారం పాటూ డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిపాడు. నాగి ఈ విషయం చెప్పగానే ఎంతోమంది ఆశ్చర్యపోయారు. నాగి వెల్లడించిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొంతమంది అతని ఆలోచనా విధానాన్ని, నాగి టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ చేతిలో ప్రస్తుతం కల్కి2 తప్ప మరో ప్రాజెక్టు లేదు. ఈ ఏడాది ఆఖరికి కల్కి2ను సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాదిలో కల్కి2 ను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు నాగి.