Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : ఇలా ఏ స్టార్‌ డైరెక్టర్ అయినా ఉంటాడా?

ఒక్క హిట్‌ పడితే నటీ నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ లక్షల్లో పారితోషికం అందుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   8 April 2025 6:11 PM IST
వైరల్‌ వీడియో : ఇలా ఏ స్టార్‌ డైరెక్టర్ అయినా ఉంటాడా?
X

ఒక్క హిట్‌ పడితే నటీ నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ లక్షల్లో పారితోషికం అందుకుంటూ ఉంటారు. దాంతో వారి లైఫ్ స్టైల్‌ మారిపోతూ ఉంటుంది. జబర్దస్త్‌లో చేసే కమెడియన్స్ సైతం ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు. వారికి వచ్చే పారితోషికాలు భారీగా ఉంటాయి కనుక అదే స్థాయిలో కార్లను కొనుగోలు చేయడం మనం చూస్తూ ఉంటాం. యాంకర్స్ సైతం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్న విషయం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సైతం ఇండస్ట్రీలో తమ హోదాను చాటుకోవడం కోసం, మరిన్ని ఆఫర్ల కోసం ఖరీదైన కార్లలో తిరగాల్సి ఉంటుంది అంటూ కొందరు అంటూ ఉంటారు.

కానీ నాగ్‌ అశ్విన్‌ అందుకు విరుద్దంగా ఉన్నాడు. ప్రభాస్‌తో తెరకెక్కించిన కల్కి సినిమాతో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నాడు. అంతే కాకుండా అంతకు ముందు రూపొందించిన మహానటి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇండస్ట్రీలో నాగ్‌ అశ్విన్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ స్థాయి క్రేజ్ ఉన్నప్పటికీ సింపుల్‌గా ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఆయన లైఫ్‌ స్టైల్‌ను చూస్తే షాకింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఆయన మాట తీరు కూడా ఒక సెలబ్రెటీ మాదిరిగా కాకుండా సింపుల్‌ వ్యక్తిగా అనిపిస్తూ ఉంటుంది.

దర్శకుడిగా టాలీవుడ్‌లో టాప్‌ పొజీషన్‌లో ఉన్న నాగ్‌ అశ్విన్‌ సింపుల్‌ లైఫ్‌ స్టైల్‌కి నిదర్శనం అన్నట్లుగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. తాను నిర్మించిన జాతిరత్నాలు సినిమాలో హీరో నవీన్‌ పొలిశెట్టి వినియోగించిన మారుతి 800 కారు గుర్తుంది కదా. ఆ కారును ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ వినియోగిస్తున్నాడు. హైదరాబాద్‌ రోడ్ల మీద ఆ చిన్న కారులో ప్రయాణిస్తూ ఉన్నాడు. పైగా ఆ కారు అద్దాలు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో లోపల ఉన్న నాగ్‌ అశ్విన్‌ క్లీయర్‌గా కనిపించాడు. దాంతో ఆయన్ను చాలా మంది వీడియోలు తీశారు. ఎంతో మంది ఆయన్ను గుర్తు పట్టినప్పటికీ సింపుల్‌గా ఆయన జనాలకు అభివాదం చేస్తూ, నవ్వుతూ ముందుకు సాగుతున్నాడు.

సాధారణంగా ఇలాంటి కార్లను దర్శకులు, నిర్మాతలు తమ గ్యారేజ్‌ల్లో పెట్టుకుంటారు, గుర్తుగా తామే ఉంచుకుంటారు. అయితే ఇలాంటి కార్లలో ప్రయాణం చేసేందుకు మాత్రం ఆసక్తి చూపించరు. కానీ నాగ్‌ అశ్విన్‌ మాత్రం స్వయంగా తానే నడుపుకుంటూ సరదాగా రోడ్ల మీద తిరగడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న దర్శకులు సైతం ఇలా రోడ్ల మీద చిన్న కార్లలో జర్నీ చేయక పోవచ్చు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఏ స్టార్‌ దర్శకుడు కానీ, చిన్న దర్శకుడికి కాని సాధ్యం అవ్వని సింపుల్‌ జీవితాన్ని నాగ్‌ అశ్విన్‌ లీడ్‌ చేస్తున్నాడు. ఆ మధ్య ఒక ఎడ్ల బండి మీద కనిపించి వైరల్‌ అయిన విషయం తెల్సిందే.