కల్కి 2 కి బ్రేక్... నాగ్ అశ్విన్ ప్లాన్ మారినట్లే..?
ఈ గ్యాప్‌లో దర్శకుడు నాగ అశ్విన్ మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
By: Tupaki Desk | 11 April 2025 3:39 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేవలం విజువల్ గ్రాండియర్ గా మాత్రమే కాకుండా, ఎమోషనల్ ఎలిమెంట్స్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి. ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడంతో.. ఈ హైప్‌తో సినిమా రెండో పార్ట్‌పై కూడా భారీ అంచనాలు మొదలయ్యాయి.
కల్కి-2 కు సంబంధించి మేకర్స్ మొదట్లోనే క్లారిటీ ఇచ్చినా, షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీనికి ప్రధాన కారణం హీరో ప్రభాస్ యొక్క డేట్స్ అందుబాటులో లేకపోవడమే. ఇప్పటికే ది రాజా సాబ్, ఫౌజీ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, త్వరగా కల్కి-2 లో జాయిన్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు నాగ అశ్విన్ మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పటికే కొన్ని నెలల క్రితమే నాగ అశ్విన్ బాలీవుడ్ స్టార్ అలియా భట్‌ను ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో సంప్రదించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ అయ్యినట్టు తెలుస్తోంది. కల్కి విజయంతో తన మేకింగ్ స్టైల్‌పై నమ్మకాన్ని పెంచుకున్న నాగ్ అశ్విన్, ఈసారి ఓ పవర్‌ఫుల్ ఫిమేల్ కేరెక్టర్ ఆధారంగా రూపొందే కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కథలోని పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.
అలియా భట్ ఇప్పటికే రాజీ, గంగూబాయి కఠియావాడి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ స్టైల్‌లో మరో వెరైటీ కథ చేయడానికి ఆసక్తిగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ పూర్తైన తరువాతే కల్కి 2 పనులు మళ్లీ పట్టాలెక్కే అవకాశముంది.
అప్పటివరకు ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల నుండి ఫ్రీ అవుతారని భావిస్తున్నారు. ఇలా చూస్తే ఈ కథలు అన్ని ముందుగానే ప్రణాళిక ప్రకారం కదులుతున్నట్టే అనిపిస్తుంది. కానీ అలియా కథ ఫైనల్ ఓకే చెబుతుందా, లేదా అన్నది మాత్రం అసలు పరీక్ష. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. మొత్తానికి.. కల్కి 2కి ఉన్న బ్లాక్ బస్టర్ బజ్ మధ్యలో నాగ అశ్విన్ లైన్ మార్చి అలియా తో కొత్త ప్రయోగం చేయడం ఆసక్తికర విషయమే. ఇది మరో విజయం సాధిస్తే, నాగ అశ్విన్ క్రియేటివ్ డైరెక్టర్‌గా మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
