Begin typing your search above and press return to search.

వావ్‌ మేకప్‌ లేకుండా కూడా భలే క్యూట్ గా ఉందే

నభా నటేష్ మాత్రం మేకప్‌ లేకుండా కూడా ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి భలే ఉందే అనే టాక్ ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 10:42 AM GMT
వావ్‌ మేకప్‌ లేకుండా కూడా భలే క్యూట్ గా ఉందే
X

ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వరుసగా హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న విషయం మనం రెగ్యులర్‌ గా చూస్తూనే ఉన్నాం.


తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేసింది. ఆ ఫోటోలు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఆ ఫోటోల్లో నభా నటేష్ మేకప్‌ లేకుండా ఉంది. మేకప్ లేకుండా చాలా మంది హీరోయిన్స్ ను కనీసం చూడలేం. వారు కూడా మినిమం మేకప్ లేకుండా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించరు.

నభా నటేష్ మాత్రం మేకప్‌ లేకుండా కూడా ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి భలే ఉందే అనే టాక్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్‌ గా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు చాలానే చూశాం. కానీ ఇలా మేకప్ లేకుండా మాత్రం ఎప్పుడు చూడలేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో మెప్పించిన ముద్దుగుమ్మ నభా నటేష్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి. హీరోయిన్ గా ఇదే రేంజ్ లో అందాల ఫోటో షూట్‌ తో ఆకట్టుకుంటూ ఉంటే తప్పకుండా మళ్లీ సినిమాలతో ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.