Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ బేబీ.. బ్యాడ్ టైమ్ లో ఓ జాక్ పాట్!

కొన్ని సినిమాలు డిస్కషన్ వరకు వచ్చి ఆగిపోయాయంట. ఇప్పుడు అనూహ్యంగా పాన్ ఇండియా సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   16 March 2024 4:56 AM GMT
ఇస్మార్ట్ బేబీ.. బ్యాడ్ టైమ్ లో ఓ జాక్ పాట్!
X

సుధీర్ బాబుకి జోడీగా నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ నభా నటేష్. మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని నటిగా కూడా ఈ బ్యూటీ మంచి మార్కులు వేసుకుంది. తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది. రవితేజకి జోడీగా డిస్కో రాజా మూవీ చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

తేజ్ తో సోలో బ్రతుకే సో బెటరు అంటూ సందడి చేసిన లక్ కలిసిరాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అంటూ గ్లామర్ షో చేసిన సక్సెస్ వరించలేదు. చివరిగా నితిన్ తో మ్యాస్ట్రో సినిమాలో జత కట్టింది. ఆ మూవీ ఫెయిల్ అయ్యింది. 2021లో ఈ సినిమా వచ్చింది. మ్యాస్ట్రో మూవీ తర్వాత నభా నటేష్ రోడ్డు ప్రమాదానికి గురైందంట. దీంతో కొంతకాలం కెమెరా ముందుకి రాలేదు.

గాయాల నుంచి కోలుకొని మరల ఏడాది కాలంగా అవకాశాల కోసం ఈ అమ్మడు ప్రయత్నం చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో తో దర్శక, నిర్మాతలకి తనని గుర్తు చేస్తోంది. కొన్ని సినిమాలు డిస్కషన్ వరకు వచ్చి ఆగిపోయాయంట. ఇప్పుడు అనూహ్యంగా పాన్ ఇండియా సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ అందుకుంది.

కార్తికేయ2తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ పీరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ లో స్వయంభు అనే మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా అవకాశం అందుకుందంట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే మూవీలో వారియర్ క్వీన్ తరహా పాత్రలో నభా నటేష్ కనిపించబోతుందంట.

ఈ క్యారెక్టర్ కోసం ఆమె యుద్ధ నైపుణ్యాలపై శిక్షణ తీసుకోబోతోందని తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రియదర్శితో ఓ కామెడీ ఎంటర్టైనర్ కి నభా నటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. స్వయంభు మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సక్సెస్ అయితే మాత్రం ఆమె కెరియర్ మళ్ళీ స్పీడ్ అప్ అయ్యి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు రావొచ్చు. అయితే ఈ అమ్మడు అదృష్టం ఎలా ఉందనేది సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది.