Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఇస్మార్ట్ బ్యూటీ ఇలా కూడా బాగుంది

కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభా నటేష్‌.

By:  Tupaki Desk   |   31 Oct 2023 9:09 AM GMT
పిక్ టాక్ : ఇస్మార్ట్ బ్యూటీ ఇలా కూడా బాగుంది
X

కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ అమ్మడు హీరోయిన్ గా మొదటి సినిమాతోనే అందంతో మరియు అభినంతో మెప్పించింది. ఈతరం హీరోయిన్స్ లో మంచి నటన ప్రతిభ ఉన్న హీరోయిన్ అంటూ చాలా మందితో ప్రశంసలు దక్కించుకుంది.


పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో నభా నటేష్ తన నటన విశ్వరూపం చూపించిందని చెప్పాలి. ఆ సినిమాలో విభిన్నమైన యాస మరియు బాడీ లాంగ్వేజ్ తో నభా నటేష్ మెప్పించింది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమా అవకాశాలు రావడం లేదు కానీ సోషల్‌ మీడియాలో ఫోటోల వల్ల రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా అయితే నభా నటేష్ ఎక్కువగా స్కిన్‌ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి పూర్తిగా కప్పుకుని ఉన్న డ్రెస్ లో ఈ అమ్మడు కన్నుల విందు చేసింది అనడంలో సందేహం లేదు.

ఈ వింటేజ్ లుక్‌ లో కూడా నభా భలే ఇస్మార్ట్‌ గా ఉందే అంటూ నెటిజన్స్ తో పాటు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న నభా నటేష్ కు ఎందుకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఇస్మార్ట్‌ బ్యూటీ ఇలా కూడా బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.