Begin typing your search above and press return to search.

బాబోయ్ సైడ్ అందాలతోనే సెగలు పుట్టిస్తున్న నభా నటేష్!

ఇప్పుడు నభా నటేష్ కూడా తాజాగా ఒక అందమైన డ్రెస్ ను మరింత మోడ్రన్ గా డిజైన్ చేయించి.. ధరించింది.

By:  Madhu Reddy   |   19 Sept 2025 4:20 PM IST
బాబోయ్ సైడ్ అందాలతోనే సెగలు పుట్టిస్తున్న నభా నటేష్!
X

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు మరింత గ్లామర్ గా కనిపించడానికి పాత లుక్ లో కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి కొంతమంది ఆల్రెడీ డిజైన్ చేసి.. కొంతమంది హీరోయిన్స్ ధరించిన దుస్తులను మళ్లీ రీ క్రియేట్ చేయించి ధరిస్తున్న విషయం తెలిసిందే.. ఇక నిన్నటికి నిన్న 1990లో డిజైన్ చేసిన ఒక డ్రెస్ ను అలియా భట్ ధరించి ఒక సినిమా ప్రీమియర్ షోలో సందడి చేయగా.. ఇప్పుడు నభా నటేష్ కూడా తాజాగా ఒక అందమైన డ్రెస్ ను మరింత మోడ్రన్ గా డిజైన్ చేయించి.. ధరించింది. ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన అందంతో అందరిని ఆశ్చర్యపరిచింది.


వైట్ కలర్ సింగిల్ షోల్డర్ మినీ మాక్స్ డ్రెస్ ను ధరించిన ఈమె...ఇందులో ఎద అందాలను హైలైట్ చేస్తూ.. థైస్ అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా నభా నటేష్ ధరించిన ఈ అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటున్నట్లు చెప్పవచ్చు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సైతం ఆకట్టుకుంది.


ఇదిలా ఉండగా ప్రస్తుతం నభా నటేష్ తాజాగా నిఖిల్ హీరోగా వస్తున్న 'స్వయంభూ' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే మరొకవైపు ఇలా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ తో పాటు సంయుక్త మీనన్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. భువన సాగర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి.


నభా నటేష్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ లో డిగ్రీ పూర్తి చేసింది. కన్నడ ఇండస్ట్రీ తోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. 2015లో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయింది. ఇక అప్పటి నుంచి చాలా సెలెక్టెడ్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నభా నటేష్.తెలుగులో 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. రవిబాబు అదుగో సినిమాలో రాజీ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అలాగే 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్ ' తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు అప్పటివరకు వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న పూరీ జగన్నాథ్ కి కూడా ఈ సినిమా మంచి విజయం అందించింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.