పిక్‌టాక్ : అందాల ఇస్మార్ట్ బటర్‌ఫ్లై
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్ ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది.
By: Tupaki Desk | 23 Jun 2025 3:42 PM ISTఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్ ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది. గత ఏడాది 'డార్లింగ్' అనే వెబ్ మూవీతో వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతానికి ఈమె పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఆ సినిమాలు ఎప్పటికి కన్ఫర్మ్ అయ్యేది క్లారిటీ లేదు. వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు తన సినిమాలతో వస్తానంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ధీమాగా చెప్పుకొచ్చింది. నభా నటేష్ సినిమా ఆఫర్ల సంగతి పక్కన పెడితే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇంత అందమైన నభా నటేష్‌కి ఆఫర్లు రావడం లేదు పాపం అంటూ నెటిజన్స్ ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి తన ఫాలోవర్స్‌తో పాటు అంతా కూడా అబ్బ నభా అంటూ చూపు తిప్పుకోనివ్వకుండా చూసే విధంగా అందమైన ఫోటో షూట్‌ను షేర్ చేసింది. బ్లూ నెట్టెడ్ డ్రెస్‌లో కనిపించిన ఈ అమ్మడు కవ్విస్తోంది. క్లీ వేజ్ షో తో మతి పోగొడుతున్న ఈ అమ్మడు మళ్లీ మళ్లీ తిరిగి చూసే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాదారణంగానే నభా నటేష్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా నభా కనిపిస్తుంది అంటూ అభిమానులతో పాటు అంతా కామెంట్స్ చేస్తున్నారు.
సింపుల్ మేకోవర్‌తో, సింపుల్ ఔట్ ఫిట్‌లో నభా నటేష్ ఆకట్టుకుంది. సింప్లీ సూపర్ అనే విధంగా ఉన్న నభా నటేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా ముందు వరకు ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి కరోనా కారణంగా ఆఫర్లు దక్కలేదు. ఏడాది పాటు పెద్దగా సినిమాలు చేయక పోవడం వల్ల ఆఫర్లు తగ్గాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వారా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తుంది. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.
కర్ణాటకలోని ఉడిపిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ అమ్మడు జాతీయ అవార్డ్ గ్రహీత ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించింది. అంతే కాకుండా మోడలింగ్ తోనూ ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుంది. కాలేజ్ రోజుల్లోనే భరతనాట్యం శిక్షణ పొందడం వల్ల ఈ అమ్మడికి డాన్స్‌లో మంచి ప్రావిణ్యం దక్కింది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే నభా నటేష్ అద్భుతమైన డాన్సర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒక సినిమా అయినా కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
