ఫిట్‌నెస్ మూడ్‌లో నభా నటేష్.. క్రేజీ క్రేజీగా..
ఇంటెన్స్ హావభావాలతో బోల్డ్ మూమెంట్స్ తో నభా ఈ వీడియోలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించింది.
By: Tupaki Desk | 5 Aug 2025 3:00 AM ISTసోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌ని మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్.. ఇప్పుడు జిమ్ స్టైల్‌లో మరోసారి ఫిదా అయ్యేలా చేసింది. సింపుల్‌గా అయినా స్టైలిష్‌గా కనిపించే నభా.. ఈసారి హైపర్ యాక్టివ్ మూడ్ లో ఒక రీల్ చేస్తూ కనిపించింది. కాసేపు జిమ్ చేస్తూ మరికొద్ది సేపు అల్లరిగా కనిపించసాగింది. లెగిన్స్, స్పోర్ట్స్ బ్రా కాంబినేషన్‌గా వేసుకున్న ఆ అటైర్... యూత్‌లో గ్లామర్ టాక్‌కు దారితీస్తోంది.
ఇంటెన్స్ హావభావాలతో బోల్డ్ మూమెంట్స్ తో నభా ఈ వీడియోలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించింది. ఆమె ఫిజిక్, ఫిట్‌నెస్ యాటిట్యూడ్ చూసిన నెటిజన్స్ “గ్లామర్ వర్షం పడుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నభా పోజింగ్ స్టైల్ వల్ల వీడియో జెట్ స్పీడ్ లో వైరల్ అయిపోయింది.
కేవలం గ్లామర్‌కే కాకుండా నభా నటేష్ కెరీర్ విషయానికి వస్తే.. 2018లో ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాదిలో ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ సరసన మెయిన్ లీడ్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత డిస్కోరాజా, అల్లుడు అదుర్స్, డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా ప్రస్తుతం నిఖిల్‌తో పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభూ’లో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో నభా సెల్ఫీలూ, స్టైలిష్ వీడియోలూ ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు జిమ్ లుక్‌లో వచ్చిన ఈ లేటెస్ట్ వీడియో కూడా నభా తన మల్టీ టాలెంట్ ప్రూవ్ చేసింది. ఎలాగైనా, ఈ ఫిట్‌నెస్ లుక్ ఆమెకు ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చేలా కనిపిస్తోంది. ఇక మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది.
