వీడియో : జిమ్ ఔట్‌ఫిట్‌లో అందాల నభా
తాజాగా ఈమె జిమ్‌కు వెళ్తుండగా మీడియా కంట పడింది. బాలీవుడ్ వీడియో గ్రాఫర్స్ ఈమెను జిమ్‌కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాల్లో బంధించారు.
By: Tupaki Desk | 4 July 2025 12:26 PM ISTఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేకున్నా తన అందమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ స్టార్ హీరోయిన్ పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 50 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. సాధారణంగా వరుస సినిమాలు చేసే హీరోయిన్స్ సైతం ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ను కలిగి ఉండరు. నభా నటేష్ మాత్రం సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో పాటు, ఏదో ఒక విషయం గురించి స్పందిస్తూ ఉంటుంది. అందుకే ఈమెకు ఏకంగా 5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు అనడంలో సందేహం లేదు. తాజాగా మరో వీడియోతో నభా నటేష్ వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ తమ అందం కాపాడుకోవడం కోసం రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్లు చేసే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. వారిలో నభా నటేష్ ఒకరు. ఈమె రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తుంది, గంటల తరబడి వర్కౌట్స్ చేయడం వల్లే ఆమె సన్నగా నాజూకుగా ఉంటుంది. తాజాగా ఈమె జిమ్‌కు వెళ్తుండగా మీడియా కంట పడింది. బాలీవుడ్ వీడియో గ్రాఫర్స్ ఈమెను జిమ్‌కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాల్లో బంధించారు. ఆ సమయంలో ఆమె కూడా వీడియోగ్రాఫర్స్‌కి హాయ్ చెబుతూ లోనికి వెళ్లింది. నభా నటేష్ టైట్ గా ఉన్న జిమ్ ఔట్ ఫిట్‌లో భలే అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నభా నటేష్ ఇలా జిమ్ డ్రెస్‌లో, టైట్ డ్రెస్‌లో కనిపించడం కొత్తేం కాదు. గతంలోనూ ఈమె తన జిమ్ డ్రెస్‌లో కన్నుల విందు చేసింది. తాజాగా మరోసారి ఈమె తన అందంతో ఆకట్టుకుంది. ఇంత అందంగా ఉన్న నభా నటేష్‌కి ఆఫర్లు లేకపోవడం విడ్డూరంగా ఉందని, ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ కళ్లు మూసుకుని ఉన్నారా.. ఈమె అందాన్ని చూడలేక పోతున్నారా అంటూ నభా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నభా నటేష్ నటన పరంగా కూడా పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ఇటీవల డార్లింగ్ అనే వెబ్ మూవీలోనూ నటనతో ఆకట్టుకుంది. అయినా కూడా పాపం నభా నటేష్‌కి ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉంది.
ప్రస్తుతానికి ఈమె కమిట్ అయిన సినిమాలు ఏమీ లేవు, కానీ రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తెలుగులో ఒక సినిమా, కన్నడంలో ఒక సినిమాను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఈమె నటించిన సినిమాలు ఏమీ రాకపోవచ్చు. కానీ వచ్చే ఏడాదిలో కచ్చితంగా ఈమె నటించిన సినిమాలు వస్తాయనే నమ్మకం ను ఈమె ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరిలో జన్మించిన ఈమె ఇంజనీరింగ్ చదివింది. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ బెలవాడి శిష్యురాలిగా ఎన్నో నాటకాల్లో నటించింది. స్కూల్ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకోవడం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఆమెకు అది ఉపయోగపడింది.