Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : కాఫీ విత్‌ క్యూట్‌ నభా

కాఫీ విత్‌ క్యూట్‌ నభా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత క్యూట్‌ ముద్దుగుమ్మ ఖాళీ లేకుండా సినిమాలు చేయాలి.

By:  Tupaki Desk   |   14 March 2025 12:00 AM IST
పిక్‌టాక్‌ : కాఫీ విత్‌ క్యూట్‌ నభా
X

పదేళ్ల క్రితం కన్నడ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నభా నటేష్‌ తెలుగులో 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సుధీర్‌ బాబు హీరోగా నటించిన ఆ సినిమా కమర్షియల్‌గా అంతంత మాత్రమే ఆడినా నభా నటేష్‌కి మాత్రం మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. పక్కింటి అమ్మాయి అనే తరహాలో నటించడంతో పాటు, కొన్ని సీన్స్‌లో ఇలాంటి అమ్మాయిలు కావాలి, ఈతరం అబ్బాయిలకు ఇలాంటి అమ్మాయిలు అయితేనే బాగుంటుంది అనిపించేలా నటించింది. తెలుగులో ఆ సినిమాతో గుర్తింపు సొంతం చేసుకున్న నభా నటేష్ తక్కువ సమయంలోనే డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ దృష్టిలో పడటంతో పెద్ద ఆఫర్‌ దక్కింది.

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా నభా నటేష్ నటించిన విషయం తెల్సిందే. తక్కువ సమయంలోనే ఈమెకి టాలీవుడ్‌లో పాపులారిటీ దక్కడంతో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. అయితే కరోనా కారణంగా ఈమె ఆ మధ్య కాస్త స్లో అయి తిరిగి పుంజుకుంది. గత ఏడాది డార్లింగ్‌ అనే వెబ్‌ మూవీలో నటించడం ద్వారా నటిగా మరోసారి తన ప్రతిభను చూపించే అవకాశం దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు నటన ప్రతిభ ఉండటం వల్ల నభా నటేష్ హీరోయిన్‌గా మంచి భవిష్యత్తు ఉందని అంటారు.

లక్‌ కలిసి రాకపోవడంతో ఎక్కువ సినిమాలు చేయలేక పోయినా ఇలాంటి అందమైన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేసినప్పుడు తప్పకుండా నభా నటేష్ ముందు ముందు అయినా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతుందని, తప్పకుండా మంచి ఆఫర్లు వస్తాయని అంతా అంటూ ఉంటారు. తాజాగా ఈమె కాఫీ టేబుల్‌ పై పెట్టుకుని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. కాఫీ విత్‌ క్యూట్‌ నభా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత క్యూట్‌ ముద్దుగుమ్మ ఖాళీ లేకుండా సినిమాలు చేయాలి. కానీ ఈమె మాత్రం అంత బిజీగా కనిపించడం లేదని కొందరు అంటున్నారు.

కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ ఉడిపిలోని కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌ ప్రారంభించింది. అక్కడ నుంచి వరుసగా సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న కారణంగా ఈమె సినిమాల్లో డాన్స్‌తో మెప్పిస్తుంది. తెలుగులో ఈమె త్వరలో ఒక సినిమాకు సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఆ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.