Begin typing your search above and press return to search.

'నాటు నాటు' అన్నారు.. 'సలామ్ అనాలి' ఆ రేంజ్ లో క్లిక్కయ్యిందా లేదా?

అయితే నాటు నాటు ఫార్ములాను వార్-2 మూవీకి గాను మేకర్స్ ఫాలో అవుతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   7 Aug 2025 1:12 PM IST
నాటు నాటు అన్నారు.. సలామ్ అనాలి ఆ రేంజ్ లో క్లిక్కయ్యిందా లేదా?
X

'నాటు నాటు' సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్ ను ఊపు ఊపేసింది. సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పించింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చింది. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండే స్టేటస్ ను అందుకుంది.

ఒకే బీట్ కు ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్ లో స్టెప్పులేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని ప్రూవ్ చేసింది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆ పాటతో గ్లోబల్ రేంజ్‌ లో అలరించారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌. అయితే ఆ సాంగ్ అంత బాగా రావడానికి రాజమౌళి కూడా ఓ కారణమనే చెప్పాలి.

అయితే నాటు నాటు ఫార్ములాను వార్-2 మూవీకి గాను మేకర్స్ ఫాలో అవుతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సాంగ్ ఉంటుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి.. నాటు నాటు ఫార్ములా రిపీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారని టాక్ వినిపించింది.

ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌ గా పేరున్న హృతిక్‌, తారక్‌ కలిసి నాటు నాటు లాంటి సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. హీరోల ఎనర్జీ మ్యాచ్ అయ్యేలా ట్యూన్ కంపోజ్ చేశారని టాక్ రావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు ప్రోమో తీసుకొచ్చారు.

తారక్, హృతిక్ కలిసి చేసిన సలాం అనాలి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోలు సూపర్ స్టెప్పులతో అదరగొట్టారు. దునియా మనకు సలాం అనాలి అంటూ సాగుతున్న పాటకు పవర్ ఫుల్ గ్రేస్ తో డ్యాన్స్ చేశారు. అద్భుతమైన పర్ఫామెన్స్ తో గ్రీక్ గాడ్, యంగ్ టైగర్ ఇరగదీశారని చెప్పాలి. ఇద్దరూ పోటీ పడి మరీ స్టెప్పులు వేశారు.

కొన్నిసార్లు.. ఎవరిని చూడాలో అర్థం కాక నెటిజన్స్ ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతున్నారట. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఓవైపు.. సలాం అనాలి సాంగ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు డిస్కస్ చేసుకుంటున్నారు. నాటు నాటు సాంగ్ తో పోల్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

అయితే నాటు నాటు ప్రోమో అప్పుడు రిలీజ్ అయినప్పుడు మామూలు సెన్సేషన్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఇప్పుడు సలాం అనాలి కూడా బాగున్నా.. నాటు నాటు అంత గ్రేస్ కనపడలేదని పలువురు నెటిజన్లు కంపేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఫుల్ సాంగ్ థియేటర్స్ లో చూశాక ఎలా అనిపిస్తుందో..