Begin typing your search above and press return to search.

దేవుడు రాసిన కమ్మని కావ్యం.. నా సామి రంగా హార్ట్ టచింగ్ సాంగ్

జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:54 AM GMT
దేవుడు రాసిన కమ్మని కావ్యం.. నా సామి రంగా హార్ట్ టచింగ్ సాంగ్
X

టాలీవుడ్‌ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్‌ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన నా సామి రంగ టైటిల్ గ్లింప్స్‌, పాత్రల ఇంట్రోస్, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి.


జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజిల్ థీమ్ పేరుతో ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను విడుదల చేశారు. కిష్టయ్య & అంజి - దేవుడి ద్వారా ఏర్పడిన ప్రత్యేక బంధమంటూ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ గాయకుడు శాండిల్య పీసపాటి ఆ పాటను ఆలపించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి లిరిక్స్ రాసి బాణీలు అందించారు.

దేవుడే రాసిన కమ్మని కావ్యమంటూ సాగిన ఈ పాటలో నాగార్జున, అల్లరి నరేశ్ మధ్య స్నేహాన్ని చూపించారు. చిన్నప్పటి నుంచి వారి బంధాన్ని హృదయాన్ని హత్తుకునేలా మేకర్స్ చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాట ఫుల్ హార్ట్ టచింగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మరోసారి తన మార్క్ చూపించారని అంటున్నారు. శాండిల్య తన గానంతో పాటకు ప్రాణం పోశారని చెబుతున్నారు.

ఈ మూవీలో అంజిగాడు (అల్లరి నరేశ్) ప్రాణాన్ని కూడా ఇటీవలే పరిచయం చేశారు మేకర్స్. మిర్నా మీనన్‌ లుక్‌ విడుదల చేశారు. మిర్నా ఈ మూవీలో మంగ పాత్రలో కనిపించనుంది. నెత్తిన మల్లెపూలు, చేతిలో సద్దిమూటతో పొలంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

నా సామి రంగ ట్రైలర్‌ను జనవరి 9వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌ దక్కించుకుంది. పవన్‌ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.