Begin typing your search above and press return to search.

నా సామిరంగా బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఇదే

గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 6:36 AM GMT
నా సామిరంగా బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఇదే
X

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక అందులో నాగార్జున నా సామి రంగా సినిమా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తప్పకుండా ఈ సినిమా సెంటిమెంట్ తో సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో కనిపిస్తోంది. గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇక ఈసారి కూడా అదే తరహాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నా సామీరంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే నైజాం లో 5 కోట్ల రేంజ్ లో ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 2.2 కోట్లు ఆంధ్రాలో మొత్తంగా కూడా 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది.

అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 15.30 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా కలుపుకుంటే అటువైపున కోటి వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రెండు కోట్లకు అమ్ముడు అయ్యాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా నా సామీరంగా సినిమా 18.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 19 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతిలో ఇప్పటివరకు ఎక్కువ శాతం సక్సెస్ అందుకున్న హీరోలలో నాగర్జున టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఈ టార్గెట్ ను తొందరగానే చేరుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

అసలే నాగార్జున చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాతో ఆయన సక్సెస్ అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మరి వీరికి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

నా సామిరంగా ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం: 5 కోట్లు

సీడెడ్: 2.2Cr

ఆంధ్రా: 8Cr

ఏపీ తెలంగాణ టోటల్:- 15.30CR

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 1Cr

ఓవర్సీస్ - 2Cr

మొత్తం వరల్డ్ వైడ్: 18.20CR

బ్రేక్ ఈవెన్ టార్గెట్: 19 కోట్లు