Begin typing your search above and press return to search.

నా సామి రంగా.. అసలు టెన్షన్ అదే..

కింగ్ నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించబోతున్న సినిమా నా సామి రంగా.

By:  Tupaki Desk   |   8 Jan 2024 2:30 PM GMT
నా సామి రంగా.. అసలు టెన్షన్ అదే..
X

కింగ్ నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించబోతున్న సినిమా నా సామి రంగా. విజయ్ బిన్నీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. జనవరి 14న మూవీ థియేటర్స్ లోకి వస్తోంది.

సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మొత్తం ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది. కమర్షియల్ రైటర్ గా పేరు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ అందించారు. అయితే ఈ మూవీని మలయాళీ హిట్ మూవీ పొరింజు మరియం జోస్‌ అఫీషియల్ రీమేక్ గానే చేస్తున్నారు. క్యారెక్టరైజేషన్స్, కోర్ పాయింట్ మాత్రమే తీసుకొని కంప్లీట్ డిఫరెంట్ గా మూవీని ఆవిష్కరించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

ముగ్గురు స్నేహితుల కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో నాగార్జున ఉన్నారు. ఇప్పటికే మూవీ బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. బంగార్రాజు తర్వాత కింగ్ నాగార్జున సాలిడ్ సక్సెస్ ని ఇప్పటి వరకు అందుకోలేదు. ఈ సినిమాపై అయితే చాలా నమ్మకంగా ఉన్నారు.

కానీ గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ని బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. తెలుగులో రీమేక్ అవుతోన్న ఈ సినిమా కూడా హిట్ కావడం లేదు. కొన్ని ఏవరేజ్ కి వచ్చి ఆగిపోయాయి. మరికొన్ని చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. అయిన కూడా నాగార్జున రిస్క్ చేసి ఈ మూవీ చేశాడు. ఇక నాసామి రంగా ఒరిజినల్ వెర్షన్ లో మెయిన్ హీరో క్యారెక్టర్ క్లైమాక్స్ లో చనిపోతుంది.

మన తెలుగు సినిమాలలో క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ ఉంటే ఆడియన్స్ చాలా వరకు యాక్సప్ట్ చేయలేరు. గతంలో నాగార్జున స్నేహం అంటే ఇదేరా సినిమా విషయంలో అదే జరిగింది. మూవీ బాగున్న క్లైమాక్స్ లో హీరో చనిపోవడంతో ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చారా లేదంటే అలానే ఉంచారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.