Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ అతనికి హిట్టు రుచి చూపిన నాగ్

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేటివిటీకి దగ్గరగా పల్లెటూరి జనానికి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో వచ్చిన కింగ్ నాగార్జున సూపర్ హిట్ అందుకునాన్డు. ఈ సినిమాతో నిర్మాతకి కూడా కెరియర్ లో సాలిడ్ సక్సెస్ ని ఇచ్చారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:21 AM GMT
ఫస్ట్ టైమ్ అతనికి హిట్టు రుచి చూపిన నాగ్
X

కింగ్ నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ భాగానే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాలు ఏవైనా సంక్రాంతికి రిలీజ్ అయితే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం టాలీవుడ్ లో ఉంది. ఎవరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఏడాది సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి.

గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో హనుమాన్ అయితే యునానమాస్ గా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో స్థానంలో నా సామి రంగా ఉందనే మాట వినిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేటివిటీకి దగ్గరగా పల్లెటూరి జనానికి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో వచ్చిన కింగ్ నాగార్జున సూపర్ హిట్ అందుకునాన్డు. ఈ సినిమాతో నిర్మాతకి కూడా కెరియర్ లో సాలిడ్ సక్సెస్ ని ఇచ్చారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి మొదటి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. సమంత యూటర్న్ సినిమాతో శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూసర్ గా మారారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. తరువాత ఊర్వశీరౌతేలాతో బ్లాక్ రోజ్ అనే మూవీ స్టార్ట్ చేశారు. అది ఆగిపోయింది. సిటీమార్ మూవీతో సోలో ప్రొడ్యూసర్ గా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ఎవరేజ్ గా నిలిచింది.

నెక్స్ట్ రామ్ పోతినేనితో ది వారియర్ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించి డిజాస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో భాగా లాస్ అయ్యారు. తరువాత నాగ చైతన్యతో చేసిన కస్టడీ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక బోయపాటి, రామ్ కాంబోలో చేసిన స్కంద మూవీ అయితే భారీ నష్టాలు మిగిల్చింది. ఇలాంటి పరిస్థితిలో కింగ్ నాగార్జునతో మలయాళీ రీమేక్ గా నా సామి రంగా మూవీ చేశారు.

ఈ సినిమా అతనికి సాలిడ్ హిట్ ని అందించింది అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రాఫిట్ లో కొనసాగుతోంది. సినిమా ప్రమోషన్స్, మార్కెట్ అన్ని విషయాలలో కూడా నాగార్జున దగ్గరుండి చూసుకొని నిర్మాతకి మంచి ప్రాఫిట్ వచ్చేలా చేశారు. నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 6 ఏళ్ళ తర్వాత శ్రీనివాస్ చిట్టూరి మొదటి సక్సెస్ ని అందుకున్నారని చెప్పొచ్చు.