Begin typing your search above and press return to search.

నా సామీ రంగ.. జెట్ స్పీడ్ లోనే..

కేవలం 60 రోజుల రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలి అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడట. ఇక నాగార్జున కూడా మరికొన్ని కథలు లిస్ట్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాను ముందు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:00 AM GMT
నా సామీ రంగ.. జెట్ స్పీడ్ లోనే..
X

అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. ఆయన చివరగా చేసిన ది గోస్ట్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ మరొక సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా రెడీ అవుతున్నారు. అయితే ఆయనకు కలిసి వచ్చే కమర్షియల్ పాయింట్స్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకోవాలి అని సిద్ధమవుతున్నారు.

బెన్నీ దర్శకత్వంలో నాగార్జున నా సామీ రంగా అనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఫినిష్ చేయాలి అని ముందుకు కొనసాగుతున్నారు. మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు.

ఇక సంక్రాంతి ఫెస్టివల్ కు ఈ సినిమాను విడుదల చేయాలని కూడా ముందే ఫిక్స్ అయ్యారు. నాగార్జున గతంలో సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు ఒంటి సినిమాలను జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేశాడు. అయితే ఇప్పుడు అదే తరహా ప్లానింగ్ తో 'నా సామిరంగా' ప్రాజెక్టును కూడా ఫినిష్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

కేవలం 60 రోజుల రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలి అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడట. ఇక నాగార్జున కూడా మరికొన్ని కథలు లిస్ట్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాను ముందు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. సంక్రాంతి సెంటిమెంట్ గా వచ్చిన సినిమాలతో నాగార్జునకు బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి.

అందుకే ఈసారి నా సామిరంగా సినిమాతో సక్సెస్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా అల్లరి నరేష్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మరొక యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.