Begin typing your search above and press return to search.

నా సామి రంగ.. ప్రేమ బండి చలో అంటే..

నా సామి రంగ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:57 AM GMT
నా సామి రంగ.. ప్రేమ బండి చలో అంటే..
X

నా సామి రంగ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ఆయన సరసన హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటించగా.. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆ ఆస్కార్ విజేత కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే.. ప్రేమ బండి చలో అంటే.. సీసా మూత ఇప్పు అంటూ సాగుతున్న పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.

టాలీవుడ్ యంగ్ సింగర్స్ మల్లికార్జున్, అరుణ్, రేవంత్, సాయి చరణ్ ఆలపించారు. ఈ సింపుల్ బీట్ సాంగ్ లో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ఏదో సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి జోష్ తో డ్యాన్స్ చేసినట్లు అర్ధమవుతోంది. ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హీరోలు రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ షాట్స్ ను కూడా మేకర్స్ యాడ్ చేశారు. చివర్లో చిత్రయూనిట్ అంతా ఫుల్ ఖుషీగా ప్యాకప్ చెప్పినట్లు కనిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. మలయాళం పోరంజు మరియం జోస్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కానీ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. ప్రముఖ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించగా.. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు.

ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన మిర్నా, రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనున్నారు. సరదాలు .. సందళ్లు ... ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. సంక్రాంతి పండుగకు సంబంధించిన సన్నివేశాలు ... డైలాగ్స్ ఉండటం ఈ మూవీ ఆడియన్స్ కు మరింతగా కనెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతి సెంటిమెంట్ ను నాగార్జున రిపీట్ చేస్తారో లేదో చూడాలి.