Begin typing your search above and press return to search.

నా సామి రంగం ముగ్గురు ముద్దుగుమ్మలు...!

ఆమె ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 6:15 AM GMT
నా సామి రంగం ముగ్గురు ముద్దుగుమ్మలు...!
X

సంక్రాంతి సందడి షురూ అయ్యింది. మొత్తం నాలుగు సినిమాల్లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదల అయ్యి పండుగ వాతావరణం క్రియేట్‌ చేశాయి. మరికొన్ని గంటల్లో నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా కూడా విడుదల అవ్వబోతుంది.

నాగార్జునతో పాటు ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు కీలక పాత్రల్లో నటించడం తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతే కాకుండా సినిమా కి ఉన్న పాజిటివ్ బజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటించింది. ఆమె ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఇక మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో ఉన్నారు.

రుక్సార్ ధిల్లాన్ మరియు మర్నా మీనన్ లు కూడా నా సామి రంగ అనిపించేంత అందంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు కూడా నా సామి రంగ సినిమా కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది.

ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా హీరోయిన్స్ గా తమ కెరీర్‌ లో అత్యున్నత స్థాయికి వెళ్లాలి అంటే కచ్చితంగా నా సామి రంగ సినిమా హిట్ అవ్వాల్సిందే. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ అయ్యేనా తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.