Begin typing your search above and press return to search.

'నా సామిరంగ'.. కింగ్ మాస్​ జాతర మొదలు

ప్రస్తుతం ఈ టైటిల్​ గ్లింప్స్ తెగ వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులకు ఈ టైటిల్ ఓ పండగలా ఉంది. కింగ్ మాస్ జాతర మొదలు

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:51 AM GMT
నా సామిరంగ.. కింగ్ మాస్​ జాతర మొదలు
X

అక్కినేని మన్మథుడు నాగార్జున ఎట్టకేలకు తన కొత్త సినిమాను అనౌన్స్​ చేసేశారు. నేడు(ఆగస్ట్​ 29) తన పుట్టినరోజు సందర్భంగా 99వ సినిమా అప్డేట్‌ను ఇచ్చేశారు. 'నా సామిరంగ' అనే టైటిల్​ను ఖరారు చేస్తూ.. మూవీ ఫస్ట్ లుక్​ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా ఉంది.

ఇందులో నాగార్జున కట్టూ, మాట తీరు, యాక్షన్ సీక్వెన్స్​ అన్నీ కొత్తగా, స్టైలీష్‌గా అదిరిపోయే రేంజ్​లో ఉన్నాయి నాగార్జున స్టైల్​గా బీడీ కాల్చుకుని నడవడం, లుంగీ మాస్​ లుక్​ అదిరిపోయిందనే చెప్పాలి. . 'జాతర జాతర' అంటూ వచ్చే బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ప్రచార చిత్రం చివర్లో.. 'ఈ సారి పండక్కి నా సామిరంగ'.. అంటూ చివర్లో నాగార్జున చెప్పే డైలాగ్ అదిరిపోయిందంతే.

ప్రస్తుతం ఈ టైటిల్​ గ్లింప్స్ తెగ వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులకు ఈ టైటిల్ ఓ పండగలా ఉంది. కింగ్ మాస్ జాతర మొదలు..' అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు తెలిపారు. "అన్నా లోపల 56 మంది రౌడీలను పోగేశా'.. 'ఈ పండక్కి పనైపోవాలి'..

'ఆళ్లు మామూలోళ్లు కాదన్నా.. పులులు'.. 'అన్నా ఆడి చెయ్యి తీసేయాలా? కాలు తీసేయాలా? ఏకంగా తల తీసేయమంటావా? ఎవడన్నా ఆడు'.. అంటూ రౌడీలంతా కలిసి మూక డైలాగులు చెబుతుంటే... అప్పుడు కింగ్ నాగ్ ఎంట్రీ సూపర్​గా ఉంది. కింగ్ అంటూ ఎలివేషన్ బాగా ఇచ్చారు. అదే రౌడీల గుంపులో ఉన్న ఆయన తన తలపైన ముగుసు తీసి రగ్డ్ గడ్డంతో నవ్వుతూ కనిపించి అదరగొట్టేశారు.

ఈ క్రమంలోనే లోపల ఉంది పులుల గుంపు కాదురా.. మేకల గుంపు అంటూ డైలాగ్​ రావడం.. కింగ్​ వారందరినీ చితకొట్టేయడం వంటి సీన్స్​ను చూపించారు. నైట్​ బ్యాక్​గ్రౌండ్​లో సాగిన ఈ సీన్స్​లో నాగార్జున లుక్ అదిరింది. సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటాయని వీడియో ద్వారా తెలిపారు. జాతర జాతర అంటూ వచ్చే బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్​గా ఉంది. ఇక టీజర్ చివర్లో 'కింగ్ మాస్ జాతర మొదలు..' అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.