Begin typing your search above and press return to search.

నా సామీ రంగ.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే

అక్కినేని నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చిన ప్రతిసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 7:25 AM GMT
నా సామీ రంగ.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే
X

అక్కినేని నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చిన ప్రతిసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకుంటున్నాడు. పూర్తిస్థాయిలో మాస్ క్యారెక్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రజెంట్ చేయడంలో నాగర్జున స్టైలే వేరు. ఇక ఈసారి నా సామీ రంగా సినిమాతో కూడా నాగార్జున మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించారు.

ఆశికా రంగనాథ్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే వరుస అప్డేట్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది. పోటీగా హనుమాన్ ఉన్నప్పటికీ కూడా నాగార్జున సినిమాకు కొన్ని మాస్ ఏరియాలలో మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి.

మొదటి రోజు నా సామీ రంగ సినిమా మొత్తంగా ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. అంచనాల ప్రకారం ఈ సినిమా నైజాంలో 1.2 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే గుంటూరు వైజాగ్ కృష్ణ నెల్లూరు జిల్లాలో కూడా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుందని టాక్. సంక్రాంతి టైంలో నాగర్జున వచ్చిన ప్రతిసారి కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాడు.

ఈసారి కూడా సక్సెస్ ఫార్ములాతో మరోసారి తన స్టామినా ఏమిటో నిరూపించారు. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజే నాలుగు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక నాగార్జున క్యారెక్టర్ ఇందులో బాగా హైలైట్ అయింది.

అలాగే అల్లరి నరేష్ ఒకవైపు కామెడీని హైలెట్ చేస్తూనే ఎమోషన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. రాజ్ తరుణ్ కూడా మంచి టైమింగ్ ఉన్న పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తానికి సంక్రాంతి టైంలో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది

ఇక ఏరియాల వారీగా నా సామీ రంగ మొదటి రోజు అందుకున్న షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజం: 1.2 కోట్లు

సీడెడ్: 85 లక్షలు

గుంటూరు: 47 లక్షలు

వైజాగ్: 50 లక్షలు

ఈస్ట్: 60 లక్షలు

వెస్ట్: 30 లక్షలు

కృష్ణ: 23 లక్షలు

నెల్లూరు: 18 లక్షలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్: 4.33 కోట్ల షేర్