Begin typing your search above and press return to search.

యంగ్ హీరో నాగుపాముల ప్ర‌పంచం!

స‌ర్ప‌క‌న్య‌ల‌పై సినిమాలు తీసారు. స‌ర్ప‌జాతి సంచారం మ‌నుగ‌డపైనా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   11 April 2025 2:00 PM IST
యంగ్ హీరో నాగుపాముల ప్ర‌పంచం!
X

స‌ర్ప‌క‌న్య‌ల‌పై సినిమాలు తీసారు. స‌ర్ప‌జాతి సంచారం మ‌నుగ‌డపైనా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలొచ్చాయి. నాగ‌దేవ‌త‌, నాగిన్, నాగ‌మ‌ణి లాంటి పేర్లతో హిస్ట‌రీలో ప్ర‌యోగాలెన్నో చేసారు. బుల్లితెర‌పై నాగిన్ సీరియల్ ఎంత ఫేమ‌స్సో తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. కానీ విచిత్రంగా నాగినుల ప్ర‌పంచంలో హీరో కామెడీలు చేస్తాడ‌నేది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఈ సినిమాలో న‌టించే హీరో ఎవ‌రో తెలుసా? .. ట్యాలెంటెడ్ కార్తీక్ ఆర్య‌న్. అత‌డు ఇటీవ‌ల భూల్ భుల‌యా 2లో అద్భుత‌మైన కామెడీతో మెప్పించాడు. అది హార‌ర్ కామెడీ జాన‌ర్.. కానీ ఇప్పుడు నాగ‌జిల్లా (నాగ్జిల్లా) పేరుతో నాగుపాముల ప్ర‌పంచంలోనే కామెడీలు చేయ‌బోతున్నాడ‌నేది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత‌డు నాగ‌రాజుగా మారి ఎలాంటి కామెడీలు చేస్తాడో చూడాలి. లేదా నాగుపాములు ప‌ట్టేవాడి క‌థ‌తో అత‌డు ఏదైనా కామెడీ చేయ‌బోతున్నాడా? వెయిట్ అండ్ సీ..

ప్రాజెక్ట్ వివ‌రాల్లోకి వెళితే దీని వెన‌క కూడా గురుడు క‌ర‌ణ్ జోహార్ ఉన్నాడు. కార్తీక్ ఆర్యన్, ఫుక్రీ దర్శకుడు మృగ్‌దీప్ సింగ్ లాంబాతో కలిసి క‌ర‌ణ్ పెద్ద ప్లాన్ వేసాడు. పాము వ‌ర్సెస్ మానవ సంఘర్షణ చుట్టూ తిరిగే ఒక కామెడీ సినిమాని ప్లాన్ చేస్తున్నారట‌. ఇప్పుడు ఈ చిత్రానికి `నాగ్జిల్లా` అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా టైటిల్‌ని గుర్తు చేస్తోంది. ప్ర‌మాద‌క‌ర డైనోసార్ విహారం, డైనోసార్ల ప్ర‌పంచం నేప‌థ్యంలో గాడ్జిల్లా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. భారీ యాక్ష‌న్ మ‌సాలా అంశాల‌తో గాడ్జిల్లా సిరీస్ లో ఎన్నో సినిమాలు వ‌చ్చి విజ‌యం సాధించాయి.

ఇప్పుడు నాగుపాముల ప్ర‌పంచంలో సినిమా అన‌గానే ఉత్కంఠ పెరిగింది. క‌ల్ట్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ గాడ్జిల్లా నుండి టేకాఫ్ చిత్ర‌మిద‌ని భావించాలి. ఈ చిత్రం హాస్యం, పూర్తి వినోదంతో నిండి ఉంటుందని సంబంధిత‌ వర్గాలు వెల్లడించాయి. దీనిని హిందీ టైటిల్ ఎలా ఉన్నా `నాగ‌జిల్లా` అని తెలుగులో టైటిల్ పెట్టేందుకు అవ‌కాశం ఉంది.

`నాగజిల్లా` టైటిల్‌ను ఖరారు చేసే ముందు మేకర్స్ `ఇచ్చాధారి నాగిన్`, `నాగ్విల్లా` వంటి టైటిల్స్‌ని కూడా ప‌రిశీలించార‌ని స‌మాచారం. ఈ చిత్రం గురించి టీమ్ చాలా ఉత్సాహంగా ఉంది. ప్రిపరేషన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఫోటోషూట్ ఇప్పటికే పూర్తయినందున పోస్టర్‌తో త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. దీనిని కరణ్ జోహార్-మహావీర్ జైన్ నిర్మిస్తారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 2025లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత‌ వర్గాలు వెల్లడించాయి. 2026 ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్తీక్ మ‌రోవైపు అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఇందులో శ్రీ‌లీల క‌థానాయిక‌. టైటిల్ ని ప్ర‌కటించాల్సి ఉంది. రొమాంటిక్ కామెడీ `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ`లో నటించనున్నాడు. సత్యప్రేమ్ కీ కథ దర్శకుడు సమీర్ విద్వాన్స్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారు.