Begin typing your search above and press return to search.

తెలుగులో 4,329 మంది హీరోలున్నారు నేనే ఎందుకు?

ఇటీవ‌ల అత‌డికి హీరోగా వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి. ప‌ది సినిమాల్లో న‌టించే అవ‌కాశాలొచ్చాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇదే విష‌యాన్ని త‌న‌వ‌ద్ద ప్ర‌స్థావిస్తే అన్వేష్ ఎంత సింపుల్ గా లైట్ తీస్కున్నాడంటే..

By:  Tupaki Desk   |   3 Nov 2023 3:13 PM GMT
తెలుగులో 4,329 మంది హీరోలున్నారు నేనే ఎందుకు?
X

"నమస్తే ఫ్రెండ్స్.. నా పేరు అన్వేష్.. నేను ప్రపంచ యాత్రికుడిని.. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ.. నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ...!! " ఈ నాలుగు మాట‌లతోనే ప్ర‌పంచాన్నే త‌న‌వైపున‌కు తిప్పేసుకుని బోలెడంత గార‌డీ చేసాడు యూట్యూబ‌ర్ యాత్రికుడు అన్వేష్‌. అత‌డి వాక్ఛాతుర్యం నేటివిటీ ట‌చ్ కి హ‌ర్షించ‌ని వారు లేరు. అభిమానులు కాని వారు లేనేలేరు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరాలో ఒక పెద్ద హీరోకి ఉన్నంత క్రేజ్ అత‌డికి ఉంది. ప్ర‌పంచదేశాల‌న్నిటినీ అత్యంత వేగంగా చుట్టేసి ప్ర‌పంచ‌వింత‌లు విశేషాల‌ను త‌న యూట్యూబ్ చానెల్ లో నిరంత‌రం అందిస్తున్న అన్వేష్‌కి అంతా ఇంతా క్రేజ్ కాదు. విశాఖ‌ప‌ట్నం త‌గ‌ర‌పు వ‌ల‌స స‌మీపంలోని ఒక విలేజ్ నుంచి వ‌చ్చి ఆరంభం రిపోర్ట‌ర్ గా ప‌ని చేసి, ఆ త‌ర్వాత క‌రోనా స‌మ‌యంలో నా అన్వేష‌ణ పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అత్యంత వేగంగా పాపుల‌రైన యూట్యూబ్ స్టార్ అత‌డు.


ఇటీవ‌ల అత‌డికి హీరోగా వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి. ప‌ది సినిమాల్లో న‌టించే అవ‌కాశాలొచ్చాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇదే విష‌యాన్ని త‌న‌వ‌ద్ద ప్ర‌స్థావిస్తే అన్వేష్ ఎంత సింపుల్ గా లైట్ తీస్కున్నాడంటే.. అస‌లు నేను హీరో ఏంటి? అనేసాడు. నిజానికి అత‌డి కామిక్ టైమింగ్.. హ్యూమ‌ర్ సెన్స్.. వాక్ఛాతుర్యం ఇవ‌న్నీ అత‌డిని నిజంగానే స్టార్ ని చేసేయ‌గ‌ల‌వు. కానీ అత‌డు తాను న‌మ్ముకున్న యూట్యూబ్ యాత్ర‌ల్ని వ‌దిలిపెట్టేందుకు సుముఖంగా లేడు. ఇండియాలో ఎంద‌రు హీరోలున్నా.. వారంతా అప్పుడ‌ప్పుడూ క‌నిపించేవాళ్లే. నేను రోజూ 20ల‌క్ష‌ల మందిని ఎంట‌ర్ టైన్ చేసే హీరోని అని ఢంకా భ‌జాయించి మ‌రీ చెబుతున్నాడు. అంతేకాదండోయ్.. టాలీవుడ్ లో ఏకంగా 4329మంది హీరోలు ఉన్నార‌ని లెక్క‌లేసి మ‌రీ చెప్పాడు ఈ ఘ‌నుడు. నిజానికి అత‌డి లెక్క చూస్తే అవును ఇది నిజ‌మేన‌ని ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే.. అంత క్యాలిక్యులేటెడ్ గా ఉంది అత‌డి విశ్లేష‌ణ‌.

ఇంత‌కీ హీరో అవుతావా లేదా? అని ద‌బాయించి అడిగితే అన్వేష్ ఏమంటాడు అంటే..! "నాకు తెలియ‌క అడుగుతాను నేను హీరో ఏంటి? హీరో అవ్వ‌మ‌ని అవ‌కాశాలొచ్చాయి. అంత‌గా కావాల‌నుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలు, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలున్నారు. ఏఎన్నార్ ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలున్నారు..కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఉన్నారు...నాయుడుగా రి ఫ్యామిలీ ఉంది..ఎమ్మెల్యే కొడుకు హీరో..ఎంపీ కొడుకు హీరో..నిర్మాత కొడుకు హీరో..డైరెక్ట‌ర్ కొడుకు హీరో.. హీరో కొడుకు హీరో..హీర‌యిన్ కొడుకు హీరో.. విల‌న్ కొడుకు హీరో..సంగీత ద‌ర్శ‌కుడి కొడుకు హీరో..క‌మెడియ‌న్ల కొడుకులు హీరోలు ..జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి వ‌చ్చిన హీరోలున్నారు..బిగ్ బాస్ నుంచి వ‌చ్చినోళ్లు హీరోలున్నారు టీవీ సీరియ‌ళ్ల నుంచి వ‌చ్చిన హీరోలున్నారు..ఆక‌రుకి నిన్న‌ యాంక‌ర్ కొడుకు కూడా హీరో..ఇంత‌మంది హీరోలు ఉండ‌గా నేనే ఎందుకు? తెలుగులో అక్ష‌రాలా 4329 మంది హీరోలున్నారు.. పాతోళ్లు కొత్తోళ్లు క‌లిపి.. ఇంత‌మంది హీరోల‌ని వ‌దిలేసి నువ్వే హీరో అంటున్నారు.

అయినా నా ముఖం ఎప్పుడైనా అద్దంలో చూశారా నాకు తెలియ‌క అడుగుతాను. నెత్తిమీద రెండు వెంట్రుక‌లు ఐదు నెల‌ల గ‌ర్భిణిలా పొట్ట‌.. భూమికి మూడ‌డుగులు ఉంటాను. ఇంకా మాట‌లు న‌త్తి ఉంటాది.. నన్ను హీరో అంటే న‌మ్మ‌డానికి .. మీ టార్గెట్ ఏంటంటే నా ద‌గ్గ‌రున్న కోటి రూపాయ‌ల బ్యాంక్ బ్యాలెన్స్ దొ*య‌డానికే క‌దా? మీకు ఇంత‌మంది హీరోలుండ‌గా నేనే కావాలా? ఏటి నేను అంత తోపు తెలియ‌క అడుగుతాను. ఇప్పుడు మీ హీరోలున్నారు. అప్పుడ‌ప్పుడు క‌న‌బ‌డ‌తారు. కానీ నేను రోజూ హీరోనే.. రోజూ 10ల‌క్ష‌ల నుంచి 20ల‌క్ష‌ల‌ మంది నా వీడియోలు చూస్తుంటారు. దీన్నే అంటారు .. కూసే గాడిదొచ్చి మేసే గాడిద‌ను చెడ‌గొట్టింద‌ని..నా ప్ర‌పంచ‌యాత్ర నేను చేస్తున్నాను క‌దా.. దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది చాలు.. ఇంక అంత‌కంటే ఎక్కువ అవ‌స‌రం లేదు. అంత‌కంటే ఎక్కు వ ఆశ‌ప‌డ‌కూడదు... అంటూ ఫుల్ గా క్లాస్ తీస్కున్నాడు అన్వేష్‌. వ్వారెవ్వా అన్వేషూ.. నువ్వు మామూలోడివి కాద‌య్యా!!