Begin typing your search above and press return to search.

లేడీ సూప‌ర్ స్టార్ కి మైత్రీ బంప‌ర్ ఆఫ‌ర్!

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. న‌య‌న‌తార‌కి టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ బంప‌ర్ ఆఫార్ ఇచ్చిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 7:39 AM GMT
లేడీ సూప‌ర్ స్టార్ కి మైత్రీ బంప‌ర్ ఆఫ‌ర్!
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార చాలా కాలంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో రాణించాల‌ని చూస్తోంది. సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స్టార్ డ‌మ్ చాటాల‌ని సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కానీ చేసిన ఏ ప్ర‌య‌త్నం పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు. మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌స్తున్నాయి త‌ప్ప‌! 'అరుంధ‌తి'లో అనుష్క రేంజ్ హిట్ మాత్రం ఇంకా ప‌డ‌లేదు. అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తోంది.

త‌న సొంత బ్యాన‌ర్లో.. .కోలీవుడ్ లో ఇత‌ర బ్యాన‌ర్ల‌లో సోలో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంగాని ఫ‌లితం మాత్రం నిరాశ‌గానే క‌నిపిస్తోంది. కంటెంట్ లోప‌మా? లేక న‌య‌న్ ఆ సినిమాల‌కు క‌నెక్ట్ కావ‌డం లేదా? లేక ప్రేక్ష‌కులు లేడీ సూప‌ర స్టార్ ని అలా ఓన్ చేసుకోలేక పోతున్నారా? అన్న‌ది తెలియ‌దు గానీ... కోలీవుడ్ లో మాత్రం ఇంకా ఆ ర‌కంగా చూస్తే ఆరంభ ద‌శ‌లోనే ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ తాను న‌టించిన ఏ ఉమెన్ సెంట్రిక్ చిత్రం కూడా భారీ బ‌డ్జెట్ తో కూడుకున్న‌ది కాదు.

ప‌రిమిత బ‌డ్జెట్ లోనే నిర్మాణం జ‌రిగాయి. ప్లాప్ అయినా పెద్ద‌గా నష్టాలు కూడా వ‌చ్చింది లేదు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. న‌య‌న‌తార‌కి టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ బంప‌ర్ ఆఫార్ ఇచ్చిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. అమ్మడిని మెయిన్ లీడ్ లో పెట్టి ఓ భారీ బ‌డ్జెట్ సినిమా నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తుంది.

ఆ సినిమా కోసం దాదాపు 70 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్మాణ సంస్థ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇది కేవ‌లం సినిమా బ‌డ్జెట్ మాత్ర‌మేన‌ట . న‌య‌న‌తార పారితోషికం స‌ప‌రేట్ అట‌. ఇది ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఓ ఐడియాగానే ఉందిట‌. ఆ సినిమాకి క‌థ గానీ...ద‌ర్శ‌కుడు గానీ ఇంకా ఫైన‌ల్ కాలేదుట‌. నయ న‌తార క్రేజ్ చూసి స‌ద‌రు నిర్మాణ సంస్థ ఇలాంటి సినిమా ఒక‌టి నిర్మిస్తే ఎలా ఉంటుంది? అన్న ఐడియా నుంచి ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐడియా బాగానే ఉంది. కానీ అంత‌కు మంచి న‌య‌న్ రేంజ్ కి త‌గ్గ స్టోరీ కావాలి. ఆ క‌థ‌తో న‌య‌న్ మెప్పించాలి. అప్పుడే ఇదంతా సాధ్య‌మ‌య్యేది.