Begin typing your search above and press return to search.

ప్రభాస్ మరో క్రేజీ కాంబో.. మైత్రి న్యూ ప్లాన్!

ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మళ్లీ కొత్త తరహా కథలను ఓకే చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   1 Aug 2023 11:21 AM GMT
ప్రభాస్ మరో క్రేజీ కాంబో.. మైత్రి న్యూ ప్లాన్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మళ్లీ కొత్త తరహా కథలను ఓకే చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ పైన కల్కి సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా ఉంది. ఇక సలార్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సలార్ మరొక పార్ట్ ఉండగా కల్కి కూడా రెండవ భాగం కూడా భవిష్యత్తులో రానుంది.

అయితే సందీప్ రెడ్డి దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే ఒక సినిమాను చాలా కాలం క్రితం అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ ప్రాజెక్టులతో పాటు ప్రభాస్ రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త తరహా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. సీతారామం దర్శకుడు హను రాఘవపుడితో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి.

ఇక ఇప్పుడు లిస్టులోకి మరో టాలెంటెడ్ దర్శకుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజు తో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకురాబోతున్నట్లు కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.

అసలైతే మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఇదివరకే ఒక సినిమా చేయాలని కమిట్మెంట్ కూడా తీసుకుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంతో కూడా కొన్ని కథలపై చర్చలు జరిపారు. కానీ మళ్ళీ ఎందుకో ఆ కాంబినేషన్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అతని కోసం ఎదురు చూడకుండా లోకేష్ కనకగజును రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఇక లోకేష్ కనకరాజు తదుపరి సినిమా లియో ఈ దసరాకు రాబోతున్న విషయం తెలిసిందే. లోకేష్ ప్రత్యేకంగా మల్టీవర్స్ కదలని చేయబోతున్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అతని లిస్టులో ప్రభాస్ కూడా సినిమా చేయబోతున్నాడు అని తెలియగానే అతనితో కూడా అదే తరహా కంటెంట్ తో వస్తాడు అనే అందరూ చర్చించుకుంటున్నారు. ఇక రజనీకాంత్ రామ్ చరణ్ సూర్య వంటి హీరోలతో కూడా లోకేష్ సినిమాలు చేయలనే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కోసం కథను సెట్ చేయమని అతనితో చర్చలు జరుపుతోంది. మరి లోకేష్ ప్రభాస్ కోసం ఎలాంటి కథను రాస్తాడో చూడాలి.