Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లోకి మైత్రీ.. హీరో‍ ఎవరంటే

తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బీటౌన్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న మైత్రీ.. ఓ అడుగు ముందుకేసింది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:36 AM GMT
బాలీవుడ్ లోకి మైత్రీ.. హీరో‍ ఎవరంటే
X

పాన్ ఇండియా చిత్రాల సందడి మొదలైన తర్వాత.. చిత్రసీమలో భాషా ప్రాంతీయత భేదాలు తొలగిపోయాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను సినీ ప్రియులు ఆదరిస్తున్నారు. దీంతో ఫిల్మ్ మేకర్స్ కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బలమైన మార్కెట్ కలిగిన హిందీ చిత్ర పరిశ్రమ మీద దృష్టి సారిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాతలు కూడా పాన్ ఇండియాలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బీటౌన్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న మైత్రీ.. ఓ అడుగు ముందుకేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని మైత్రీ భావిస్తున్నా.. ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు.

దీంతో గద్దర్ 2 సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చినా సన్నీడియోల్ తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మైత్రీ సంస్థ. తెలుగు హీరోలు ప్రస్తుతం ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందట. ఒక వేళ ఉన్నా హీరోలు అడిగిన రూ.25 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వలేమని నిర్ణయించుకుందట.

టాలీవుడ్ సీనియర్ హీరోలకు రూ.28 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినా థియేటర్ మార్కెట్ రూ.25 కోట్లు కూడా రావట్లేదట. అందుకే బాలీవుడ్ లో ఓ మంచి సినిమా తీస్తే లాభాల బాట పట్టవచ్చని మైత్రీ మేకర్స్ ఆలోచిసున్నారట. హిందీ మార్కెట్ వేరే లెవెల్ ఉంటుందని చెబుతున్నారట.

అయితే దర్శకుడు గోపీచంద్ మలినేనిని తీసుకుని బాలీవుడ్ కు వెళ్తున్నారట మైత్రీ మూవీ అధినేతలు. ఆయన చేత సన్నీడియోల్ కు కథ కూడా ఇటీవలే చెప్పించారట. ఆ కథ కూడా సన్నీకి నచ్చిందట. బడ్జెట్ లెక్కలు, ప్లాన్ గీసుకుని రంగంలోకి దిగడమే లేటు. అయితే గోపీచంద్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు నార్త్ రూరల్ అభిమానులకు భలేగా నచ్చుతాయని నెటిజన్లు అంటున్నారు.

వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు మూటగట్టుకుంటున్నా.. సినిమా సినిమాకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్లు పెంచుతున్న సీనియర్ హీరోలు ఇకనైనా ఆలోచించుకోవాలని సినీ పండితులు చెబుతున్నారు. రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ తగ్గించికోకపోతే మన నిర్మాతలు ఇలాగే హిందీ, తమిళం వైపు వెళ్లిపోతారని అంటున్నారు. మరి చూడాలి ఇప్పటికైనా సీనియర్ హీరోలు ఒక మెట్టు దిగాతారేమో.