Begin typing your search above and press return to search.

నైజాం గడ్డపై మైత్రి దందా.. పెద్ద జాక్ పాటే

ఓ వైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో బడ్జెట్ మూవీలు తెరకెక్కిస్తోంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 1:30 PM GMT
నైజాం గడ్డపై మైత్రి దందా.. పెద్ద జాక్ పాటే
X

శ్రీమంతుడు మూవీతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ వైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో బడ్జెట్ మూవీలు తెరకెక్కిస్తోంది. మరిన్ని చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఏడాదికి తక్కువలో తక్కువగా 5 నుంచి 6 సినిమాల వరకు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్నాయి.

ఇక, ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మైత్రీ మూవీ మేకర్స్ వెలుగొందుతోంది. సినిమాల ఫ్రీక్వెన్సీ, రేంజ్ పరంగా దాన్ని నంబర్ వన్ సంస్థగా చెప్పవచ్చు. ఇటీవల నైజాంలో హనుమాన్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.కోట్లలో లాభాలు సంపాదించింది. నైజాం ఏరియాకు గాను ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ ను మైత్రి దక్కించుకోగా.. ఇప్పుడు రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేసింది హనుమాన్.

దీంతో మైత్రి అధినేతలు పండుగ చేసుకుంటున్నారట. పెట్టుబడి మీద నాలుగు రెట్ల లాభం అంటే మమూలు విషయం కాదు కదా. ఇక పుష్ప-2 సహా అరడజను దాకా క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ చేతిలోనే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో అల్లు అర్జున్ మూవీని తెరకెక్కిస్తోంది మైత్రి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ కూడా మైత్రి చేతిలోనే ఉంది.

అయితే నైజాంలో హనుమాన్ తో పాటు గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సలార్ ను కూడా మైత్రీ సంస్థనే డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2ను కూడా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. దీంతో ఇలా ఒక్కో సినిమాను యాడ్ చేసుకుంటూ వెళ్తూ.. మైత్రి సంస్థ నైజాంలో బిగ్ ప్లేయర్ గా అవతరించబోతుందని సినీ పండితులు చెబుతున్నారు.

నైజాంలో థియేటర్ల లీజ్ లను తీసుకోవడం కూడా మైత్రి సంస్థకు బిగ్ ప్లస్ పాయింట్ కాబోతోందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చాలా మంది 'దెబ్బలు తిని' తప్పుకున్నారని.. మైత్రి మాత్రం పోరాడి నిలిచిందని కొనియాడుతున్నారు. మరోవైపు, కోలీవుడ్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన మైత్రి.. బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. సినీ రంగంలో దూసుకుపోతోంది.