Begin typing your search above and press return to search.

విజయ్.. ఆ సినిమాల కోసం ఇప్పుడేంటి గోల?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 April 2024 7:30 AM GMT
విజయ్.. ఆ సినిమాల కోసం ఇప్పుడేంటి గోల?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ.. యూత్ అంచనాలను అందుకోలేకపోయింది.

ఇప్పుడు థియేటర్ల నుంచి మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అనుకున్న తేదీ కన్నా ముందే మే 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ.. ఖుషితో పర్వాలేదనిపించారు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ హిట్ కొడదామని అనుకున్నారు. కానీ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుందో లేదో క్లారిటీ లేదు. లాభాలు కాకపోయినా.. పెట్టుబడి వచ్చిందని కొందరు అంటున్నారు. నిర్మాతలకు నష్టం వచ్చిందని మరికొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ ఇదివరకే నటించిన డియర్ కామ్రేడ్, ఖుషి చిత్రాల వసూళ్ల వివరాలు బయటకు రానున్నాయి. ఈ రెండు మూవీలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. మొత్తం లెక్కలను వెరిఫై చేసి క్లారిటీ ఇవ్వనుందట.

గత కొద్ది రోజులుగా డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాలు.. మేకర్స్ కు భారీ నష్టాలు మిగిల్చాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి చెక్ పెట్టేందుకు మైత్రీ సంస్థ.. ఆ సినిమాల లెక్కలు బయటకు తీయబోతున్నట్లు తెలుస్తోంది. చెప్పాలంటే.. ఆ రెండు చిత్రాలు మేకర్స్ కు టేబుల్ ప్రాఫిట్ అందించాయి. కొన్ని చోట్ల మాత్రం బయ్యర్లకు కాస్త నష్టమైనా.. చెప్పుకోదగ్గ నష్టం ఎవరికీ రాలేదు. అందుకే మైత్రీ సంస్థ ఆ వసూళ్లపై క్లారిటీ ఇవ్వనుందని సినీ ఇండస్ట్రీలో టాక్.

ఇప్పటికే టాలీవుడ్ లో ఇలా ఓసారి జరిగింది. నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్, హాయ్ నాన్న చిత్రాల వల్ల మేకర్స్ భారీగా నష్టపోయారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వెంటనే ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ రెండు సినిమాల వసూళ్ల లెక్కలపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మైత్రీ సంస్థ కూడా అదే బాటలో నడుస్తోంది. తమ సినిమాలపై వస్తున్న ఫేక్ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయింది. మరేం జరుగుతుందో చూడాలి.