మైత్రీ షారుక్‌కు అంత ఆఫర్ చేసిందా?
`పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 3:42 PM IST`పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. భారీ సినిమాలని ప్రకటిస్తూ నిర్మాతలుగా సరికొత్త టార్గెట్‌లకు రీచ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. `పుష్ప 2`తో దేశ వ్యాప్తంగా క్రేజీ స్టార్లతో పాటు రికార్డు స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టకున్న మైత్రీ మూవీ మేకర్స్ త్వరలో భారీ ప్రాజెక్ట్‌కు స్కెచ్ వేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న మైత్రీ రీసెంట్‌గా హిందీలోకి అడుగు పెట్టడం తెలిసిందే.
సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `జాట్` మూవీని చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైనే రాబట్టింది. దీని తరువాత ప్రదీప్ రంగనాథన్‌తో `ద్యూడ్` మూవీని నిర్మిస్తున్న మైత్రీ తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌పై కన్నేసిందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లోనూ భారీ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆ సారి షారుక్ ఖాన్‌తో రంగంలోకి దిగాలని ప్లాన్ చేస్తోందట.
`పఠాన్, జవాన్ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన షారుక్‌కు మైత్రీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ స్థాయిలో పారితోషికం అందుకోనున్న తొలి ఇండియన్ హీరోగా షారుక్ సరికొత్త రికార్డుని సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా ప్యాజెక్ట్‌కు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తారని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌ని రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరపైకి తీసుకొస్తారట. ఇప్పటికే ఈ స్థాయి బడ్జెట్‌తో రామాయణ, SSMB29 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలలో ఆ స్థాయి బడ్జెట్‌తో తెరపైకి రానున్న మూడవ సినిమాగా షారుక్ - సుక్కుల ప్రాజెక్ట్ నిలవనుంది. ఈ మూవీతో షారుక్‌ని సరికొత్త పంథాలో సుకుమార్ ఆవిష్కరించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజమైతే మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మాణ రంగంలో ఊహించని మైల్ స్టోన్‌కి రీచ్ అయినట్టే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా నిలవడంతో అందరి దృష్టి మైత్రీ వారిపై పడింది. హోంబలే ఫిల్మ్స్ తరహాలో మైత్రీ కూడా షారుక్‌తో ప్రాజెక్ట్‌ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆ రోజు రావాలని సుక్కు, షారుక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.