మైత్రీ నిర్మాతల ప్యాషన్.. కొత్త వాళ్లైనా కథ నచ్చితే చేసేయడమే!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఆ సినిమాలో మినిమం కంటెంట్ ఉంటుందనే రీతిలో నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని.
By: Tupaki Desk | 18 Jun 2025 4:41 PM ISTటాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఆ సినిమాలో మినిమం కంటెంట్ ఉంటుందనే రీతిలో నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని. కథ నచ్చితే ఆ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడని నిర్మాతలు వీళ్లు. తమ బ్యానర్ లో కేవలం రంగస్థలం, పుష్ప లాంటి భారీ ప్రాజెక్టులే కాదు, కథ నచ్చితే చిన్న సినిమాలనైనా చేస్తామని 8 వసంతాలు సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు.
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఈవెంట్ కు హాజరైన ప్రతీ ఒక్కరూ మైత్రీ మూవీ మేకర్స్ గురించి, వారి ప్యాషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మైత్రీ నిర్మాతలు మనిషిని మనిషిగా చూస్తారని, మంచి కథ ఉంటే మైత్రీలోకి ఎలాగైనా రావొచ్చని, మంచి కథలను మైత్రీ నిర్మాతలు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని అందరికీ తెలియచేశారు.
17 నుంచి 25 ఏళ్ల మధ్య ఓ అమ్మాయి జీవితంలో జరిగే కథగా తెరకెక్కిన సినిమానే 8 వసంతాలు అని, ఈ సినిమాకు ఫణి, అనంతిక పిల్లర్లుగా నిలిచారని, విజువల్ గా సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమాతో ఫణి చాలా ఎమోషనల్ కంటెంట్ ను చెప్తున్నాడని, కొత్త వాళ్లతో తాము చేసిన ఈ ప్రయత్నం కచ్ఛితంగా సక్సెస్ అవుతుందని నిర్మాత రవిశంకర్ చెప్పారు.
8 వసంతాలు చాలా డిఫరెంట్ మూవీ అని, కథ వినగానే బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రయత్నం చేశామని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, ఈ సినిమా కోసం చాలా మంది కొత్త వాళ్లు పని చేశారని, వారి కోసమైనా 8 వసంతాలు పెద్ద సక్సెస్ అవాలని నిర్మాత నవీన్ యెర్నేని కోరారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రూ.100 కోట్ల సినిమా చేసినా, రూ.10 కోట్ల సినిమా చేసినా అదే ప్యాషన్ తో వర్క్ చేస్తారని, ఇలాంటి యూనిక్ కథలకు మైత్రీ లాంటి పెద్ద బ్యానర్ ప్లాట్‌ఫామ్ అవడం ఎంతో ఆనందంగా ఉందని, టీమ్ పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుందని, బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందని ఈవెంట్ కు హాజరైన నందినీ రెడ్డి అన్నారు.
